Share News

NRI: చంద్రబాబు గెలుపు కోసం ఎన్నారైల విస్తృత ప్రచారం

ABN , Publish Date - Apr 28 , 2024 | 07:09 PM

ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపు కోసం ఎన్నారైలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

NRI: చంద్రబాబు గెలుపు కోసం ఎన్నారైల విస్తృత ప్రచారం

  • చంద్రబాబు కోసం చలో ఆంధ్రప్రదేశ్‌

  • విదేశీ ఏసీ గదుల నుండి మాతృదేశ మండుటెండలో ప్రచారం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంపై విదేశాలలోని ప్రవాసీయులు అత్యంత ఆసక్తి కనబర్చడమే కాకుండా తమకు వీలయిన విధంగా రాష్ట్రాన్ని రక్షించేందుకు ప్రత్యక్షంగా రంగంలో దిగుతున్నారు. మాతృభూమిపై మమకారంతో స్వదేశానికి వచ్చి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారు కొందరైతే విదేశాలలో ఉద్యోగాలు చేసుకోంటూ తమ తమ స్వస్థలాలలో తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండంటూ ప్రచారం చేసే వారు అత్యధికులు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న వారిలో సింహభాగం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు.

ఇప్పటి వరకు తెలుగునాట ఏ రాజకీయ పార్టీకీ లేని విధంగా పెద్ద సంఖ్యలో విదేశాలలోని అభిమానులు ఉద్యోగాలకు సెలువు పెట్టి, వ్యాపారాలకు తాత్కలిక విరామం ఇచ్చి మరీ తెలుగుదేశం పక్షాన ప్రచారం చేయడానికి విమానలెక్కుతున్నారు. ఈ రకమైన అంకితభావం కల్గిన ప్రవాసీయులు ఇప్పటివరకూ కేరళ రాష్ట్రంలోని యు.డి.యఫ్, యల్.డి.యఫ్ లలోని కొన్ని కీలక భాగస్వామ్య పార్టీలలో మాత్రమే ఉండగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వినూత్నంగా ముందుకు వస్తోంది. గత ఎన్నికలలో కూడా కొంత మంది ప్రవాసీ కార్యకర్తలు పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా వేర్వేరుగా వచ్చే వారు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ అమెరికా నుండి వచ్చి మోహరించడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

4.jpgNRI: కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు


తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పోటి చేస్తున్న అన్ని నియోజకవర్గాలలో ఎన్నారై తెలుగుదేశం బృందాలు ఇప్పటికే చేరుకొన్నాయి. విదేశాలలో ఏసీ గదులలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే వీరు ఆంధ్రప్రదేశ్‌లో మండే ఎండలో చెమటోడ్చుతూ చంద్రబాబును అధికారంలోకి తీసుకోరావడానికి కష్టపడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థులకు బి-ఫారంలు ఇచ్చే సందర్భంగా ఎన్నారైల పాత్రను వివరిస్తూ సంబంధిత నియోజకవర్గాలలో ఉండే ప్రవాసీ బృందం జాబితాను అందిస్తుండడంతో వీరి ప్రాధాన్యతను గుర్తించినట్లయింది.

ప్రపంచంలో అత్యధికంగా పెట్రోలును ఉత్పత్తి చేసే సౌదీ ఆరంకో కంట్రాక్టింగ్ చేసే రావి రాధాకృష్ణా గానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసే బి. వెంకట రాంకిషోర్ లేదా అమెరికాలో వ్యాపారం చేసే మల్లిక్ మడేరమట్ల తరహా దాదాపు 1500 మంది మాతృదేశానికి వెళ్తున్నారు. కొందరు ఇప్పటికే చేరుకొని వివిధ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తుండగా మరికొందరు విమానాల టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం అధినేతలు యన్.చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు క్రమంగా ఎన్నారైల ప్రచార తీరును గమనిస్తున్నట్లుగా సమాచారం. మంగళగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన వార్ రూంలో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కీలకపాత్ర వహిస్తున్నారు.

3.jpg


నిరుద్యోగ సమస్య కీలకాంశం కావడంతో విదేశాలలో తెలుగు యువతకు ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ తెలుగుదేశం ఇచ్చిన హామి ఆసక్తి కల్గిస్తోంది. విదేశాలలో తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పని చేసే వారు భారీగా ఉండగా అందులో కొన్ని వేల మంది వ్యాపారవేత్తలుగా ఉండగా వీరిలో కనీసం 5 వేల మంది ఒక్కొక్కరు తమ సంస్థలలో సంవత్సరానికి కనీసం అయిదుగురు చొప్పున అయిదేళ్ళ కాలంలో 20 మందికి చొప్పున ఉపాధి కల్పిస్తే సునాయసంగా ఒక లక్షా మందికి ఉద్యోగావకాశాలను కల్పించగలుగతామని తెలుగుదేశం నాయకులు పెర్కొంటున్నారు.

2.jpgవిదేశాలలో ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా తెలుగుదేశం పార్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను చాలా కాలంగా నిర్వహిస్తోందని గుర్తు చేస్తూ లక్ష కంటే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే ఆవకాశం ఉందని తెలుగు దేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ పెర్కొన్నారు. భారీ సంఖ్యలో తెలుగు విద్యార్థులు విదేశాలలో ఉంటున్నా వారికి సరైన మార్గదర్శకం లేదా సహాయం అందించే వ్యవస్థ కరువైందని, విద్యార్ధులకు ప్రత్యేక సహాయక కేంద్రాలను నెలకొల్పనున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు.

1.jpgఉద్యోగ రీత్యా తాము భౌతికంగా అరబ్బు దేశంలో ఉన్నా తమ ఆత్మ మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను దాటి రాలేదని తెలుగుదేశం పార్టీ కువైత్ ఇన్‌చార్జి కోడూరి వెంకట్ వ్యాఖ్యానించారు. కువైత్ జాతీయ పెట్రోలియం సంస్థలో ఇంజినీర్‌గా పని చేసే వెంకట్ తన ఉద్యోగానికి సెలువు పెట్టి ప్రస్తుతం తెలుగునాట ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.

Read Latest NRI and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 07:19 PM