Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:09 PM
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ హోటల్‌లో.. సర్వర్‌గా, వెయిటర్‌గా పని చేసేందుకు భారతీయులు భారీగా క్యూ కట్టారు. ఈ ఘటన కెనడాలో బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది. సదరు రెస్టారెంట్‌లో సర్వర్, వెయిటర్ ఉద్యోగాల కోసం.. దాదాపు 3 వేల మంది విద్యార్థులు క్యూ కట్టారు.
కెనడా, అక్టోబర్ 06: విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ హోటల్‌లో.. సర్వర్‌గా, వెయిటర్‌గా పని చేసేందుకు భారతీయులు భారీగా క్యూ కట్టారు. ఈ ఘటన కెనడాలో బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది. సదరు రెస్టారెంట్‌లో సర్వర్, వెయిటర్ ఉద్యోగాల కోసం.. దాదాపు 3 వేల మంది విద్యార్థులు క్యూ కట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బ్రాంప్టన్‌లో కొత్త రెస్టారెంట్ ప్రారంభించనున్నాం. అందులో సర్వర్లు, వెయిటర్ల జాబ్‌ల కోసం రెస్టారెంట్ నిర్వహాకులు ఓ ప్రకటన ఇచ్చారు. దీంతో ఆయా ఉద్యోగుల కోసం భారతీయ విద్యార్థులు పెద్ద క్యూ కట్టారు. అయితే ఈ ఉద్యోగాల కోసం భారీగా క్యూ కట్టిన ఈ వీడియోను మేఘ్ అప్‌డేట్స్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేసింది. ఇది ఒక భయానక దృశ్యమన్ని అభివర్ణించింది. ఈ దృశ్యం కెనడాలో నిరుద్యోగాన్ని సూచిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగాలు అందుకోవాలని కలలు కంటూ భారత్ నుంచి కెనడా బయలుదేరే విద్యార్థులు ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేఘ్ అప్‌డేట్స్ అభిప్రాయ పడింది. ఈ వీడియో వైరల్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక మంద్యం నడుస్తుందని.. ఇటువంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లకుండా ఉండమే ఉత్తమమైన నిర్ణయమని ఒకరు స్పష్టం చేశారు. రెస్టారెంట్లల్లో చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు.. ఇలా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారని మరొకరు గుర్తు చేస్తున్నారు. విద్యార్థులు చదువుకుంటూ.. ఇలా పార్ట్‌టైం ఉద్యోగాల చేస్తూ.. ఆర్థిక అవసరాలు తీర్చుకుంటారని ఇంకొకరు వివరించారు. అయితే ఇది నిరుద్యోగం ఎంత మాత్రం కాదని మరొకరు స్పష్టం చేశారు.
ఇది కేవలం పార్ట్ టైం జాబ్ మాత్రమేనని వారు వివరిస్తున్నారు. తొలుత కెనడా వచ్చిన విద్యార్థులకు ప్రారంభం కొద్దిగా కష్టంగానే ఉండవచ్చు. కానీ ఈ కఠిన పరిస్థితులను వారు ఏదో ఒక రోజు అధిగమిస్తారు. అనంతరం సుసంపన్నమైన జీవితాన్ని వారు గడుపుతారని మరొకరు ఈ సందర్బంగా స్పష్టం చేశారు.