TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు..

ABN, Publish Date - Mar 26 , 2024 | 08:58 AM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పంలో పర్యటించి.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధికి 35 ఏళ్ల పాటు తాను పడిన కష్టాన్ని కేవలం ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన అన్ని ప్రణాళికలు రచించి అమలు చేస్తామని చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 1/7

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పంలో పర్యటించి.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కుప్పం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 2/7

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలోని కేవీఆర్ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దృశ్యం.

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 3/7

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తాను చేయదలచుకున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సభలో ప్రజలకు వివరిస్తున్న చంద్రబాబు నాయుడు..

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 4/7

ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆర్థికంగా, రాజకీయంగా మేలు చేసింది తెలుగుదేశం అని.. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ పథకాలన్నీ రద్దు చేసి, ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల సంక్షేమం, రక్షణ బాధ్యత తనదని చెబుతున్న చంద్రబాబు.

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 5/7

కుప్పంలోని కేవీఆర్ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు.. ఓ సోదరునికి స్వీట్ తిరిపిస్తున్న దృశ్యం.

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 6/7

కుప్పంలోని ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముస్లిం మత పెద్ద స్వీట్ తిరిపిస్తున్న దృశ్యం.

TDP: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు.. 7/7

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు.

Updated at - Mar 26 , 2024 | 08:58 AM