Rain Alert: శ్రీకాకుళంలో జిల్లాలో భారీ వర్షాలు..

ABN, Publish Date - Sep 09 , 2024 | 10:37 AM

శ్రీకాకుళం జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వరద ముప్పు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బస్టాండ్, లోతట్టు ప్రాంతాలు, రహదారులపై వరదనీరు చేరి జలమయమయ్యాయి. వర్షపునీటితో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇదే రీతిన మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు.

Updated at - Sep 09 , 2024 | 10:37 AM