ఏపీ నిరుద్యోగుల జేఏసీ, ఏఐవైఎఫ్ ర్యాలీ..
ABN, Publish Date - Feb 08 , 2024 | 12:28 PM
అనంతపురం: మెగా డీఎస్సీ అంటూ దగా చేసిన సీఎం జగనను ఓడించేందుకు 15 లక్షల మంది నిరుద్యోగులు సంసిద్ధం అవుతున్నారని ఏపీ నిరుద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు. ఏపీ నిరుద్యోగుల జేఏసీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, నిరుద్యోగులు బుధవారం అనంతపురం నగరంలో నిరసన తెలిపారు. క్లాక్ టవర్ నుంచి సుభాష్ రోడ్డుమీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. 23 వేల పోస్టులతో డీఎస్సీ విడుదల చేయాలని, జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
1/5
ఏపీ నిరుద్యోగుల జేఏసీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, నిరుద్యోగులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థుల అనంతపురం నగరంలో టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన దృశ్యం.
2/5
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత అనంతపురం నగరంలో టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారంతో నిరసన తెలుపుతున్న దృశ్యం
3/5
మెగా డీఎస్సీ అంటూ దగా చేసిన సీఎం జగన్‌ను ఓడించేందుకు నిరుద్యోగులు సంసిద్ధం అవుతున్నారంటూ ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్
4/5
నాడు మెగా.. నేడు దగా చేసిన సీఎం జగన్ 25వేల ఉపాధ్యాయుల పోస్టులతో మెగా డీఎస్సీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన ఏఐవైఎఫ్
5/5
మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ వదిలి ఎన్నికలకు వెళితే.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన ఏఐవైఎఫ్ నేతలు
Updated at - Feb 08 , 2024 | 12:28 PM