Deputy CM: జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌లో పవన్ కల్యాణ్

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:09 AM

విజయవాడ: జల్ జీవన్ మిషన్ అమలపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన ‌మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగష్టులో‌ ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయ్యిందని.. 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజూ నీటి సరఫరా చేయాలన్నారు. 55 ‌లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు.

Updated at - Dec 19 , 2024 | 11:09 AM