నల్గొండలో సీఎం కప్ ర్యాలీ..
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:22 PM
నల్గొండ జిల్లా: నగరంలోని క్లాక్ టవర్ వద్ద సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ క్రీడాకారులలో క్రీడల పట్ల అవగాహన కల్పించి, క్రీడలను పెంపొందించేందుకు ఉద్దేశించి చేపట్టిన సీఎం కప్పు క్రీడల్లో భాగంగా టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు.
Updated at - Oct 18 , 2024 | 12:22 PM