ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు..

ABN, Publish Date - Sep 02 , 2024 | 10:13 AM

ఖమ్మం: తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్-ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల్లోకి మున్నేరు వరద పోటెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు బయటకు రాలేకపోతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 1/9

ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 2/9

ఖమ్మం నగరంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం...

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 3/9

ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోతున్న వస్తువులు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 4/9

రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో ఖమ్మం నుంచి అల్లిపురం వెళ్లే రహదారిని అధికారులు నిలిపివేసిన దృశ్యం..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 5/9

ఖమ్మం నగరంలో వర్షానికి ఇళ్లల్లోనుంచి పారుతున్న వరద నీరు...

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 6/9

చెరువును తలపిస్తున్న రోడ్డు.. మోకాలులోతు నీటిలో నచుడుకుంటూ వెళుతున్న జనాలు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 7/9

ఖమ్మం నగరంలోని రోడ్డుపై ఉన్న షాపుల్లోకి చేరిన వరద నీరు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 8/9

ఇంట్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న మహిళలు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు.. 9/9

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షానికి నడుమలోతుపైగా రోడ్డుపై నిలిచిన వరద నీరు.

Updated at - Sep 02 , 2024 | 10:13 AM