సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు..

ABN, Publish Date - Aug 19 , 2024 | 01:44 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆయనకు రాఖీ కట్టారు. అలాగే మంత్రి సీతక్క రేవంత్ రెడ్డికి, ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఇంకా ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా పండుగ జరుపుకుంటున్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 1/9

రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 2/9

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి సీతక్క.. ప్రక్కన సీఎం సతీమణి, కుమార్తె..

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 3/9

సీఎం రేవంత్ రెడ్డి మనుమడికి రాఖీ కడుతున్న మంత్రి సీతక్క..

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 4/9

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కావ్య..

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 5/9

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయి...

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 6/9

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి.. ప్రక్కన మంత్రి సీతక్క..

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 7/9

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న కార్పొరేషన్ చైర్మన్ నెరేళ్ల శారద.. ప్రక్కన మంత్రి సీతక్క..

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 8/9

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

 సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు.. 9/9

రాఖీ పౌర్ణమి సందర్భంగా తనకు రాఖీ కట్టేందుకు వచ్చిన బ్రహ్మకుమారీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క..

Updated at - Aug 19 , 2024 | 01:45 PM