Yadadri.. యాదాద్రి సామూహిక గిరి ప్రదర్శన
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:59 PM
యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు. వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. వైకుంఠ ద్వారం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ, వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈవో భాస్కర్ రావు, భక్తులు..

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు హారతి ఇస్తున్న దృశ్యం.

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని.. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా మల్లాపురం, గోశాల వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మొక్కను నాటి నీరు పోస్తున్న దృశ్యం.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తీర్థప్రసాదాలు అందజేస్తున్న ఆలయ ఈవో భాస్కరరావు.
Updated at - Jul 15 , 2024 | 12:59 PM