ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
ABN, Publish Date - Oct 11 , 2024 | 02:43 PM
ఐరన్ శరీరంలో కీలకమైన ఖనిజం. ఇది మహిళల ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.

ఐరన్ లోపిస్తే రక్తహీనతతో సహా చాలా రకాల సమస్యలు సమస్యలు వస్తాయి. వీటిని అధిగమించాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.

పాలకూరలో ఐరన్ కంటెంట్ మాత్రమే ఇతర పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

కాయధాన్యాలలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ఐరన్ కూడా ఉంటుంది. వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

ఎర్ర మాంసంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి కావలసిన ఐరన్ అందిస్తుంది.

క్వినోవా గ్లూటెన్ రహిత ధాన్యం. ఇందులో ఐరన్, ప్రోటీన్ కూడా సమృద్దిగా ఉంటాయి.

శనగలలో ఐరన్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. ఉడికించిన లేదా వేయించిన శనగలు తింటే ఐరన్ లోపం ఉండదు.

కోకో కంటెంట్ ఎక్కువ ఉన్న డార్క్ చాక్లెట్ లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది.

గుమ్మడి గింజలలో ఐరన్ మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే మంచిది.
Updated at - Oct 11 , 2024 | 02:43 PM