AP Elections: ‘ఫ్యాను’ పార్టీ పాడుపని.. చీ.. ఛీ.. ఇంత దిగజారాలా జగన్..?
ABN , Publish Date - Feb 29 , 2024 | 09:42 AM
YSRCP Cheap Politics: వైసీపీ (YSR Congress) ఫేక్ ప్రచారానికి కాదేది అనర్హం.. అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రజ్యోతి. కామ్’లో ఎన్ని వార్తలు చూశామో లెక్కేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతుండటం.. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి కదనరంగంలోకి దూకడంతో వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయని గట్టిగానే టాక్ నడుస్తోంది..
వైసీపీ (YSR Congress) ఫేక్ ప్రచారానికి కాదేది అనర్హం.. అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రజ్యోతి. కామ్’లో ఎన్ని వార్తలు చూశామో లెక్కేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతుండటం.. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి కదనరంగంలోకి దూకడంతో వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయని గట్టిగానే టాక్ నడుస్తోంది. దీంతో ఎలాగైనా సరే టీడీపీని బద్నామ్ చేయాలని ఆపసోపాలు పడుతోంది. ఓ వైపు అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినా.. ఇంతవరకూ వారంతా ఎక్కడున్నారో.. అసలు పోటీ చేస్తారో లేదో కూడా తెలియట్లేదు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) ‘సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలు తుస్సుమనడం.. ఇక సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కీలక నేతలు ఫ్యాను పార్టీ వద్దు బాబోయ్.. సైకిల్, గాజు గ్లాస్ పార్టీలే ముద్దంటూ జంప్ అయిపోతున్నారు. దీంతో వైసీపీ పెద్దలకు.. ముఖ్యంగా వైఎస్ జగన్‌కు ఫ్రస్టేషన్ పెరిగిపోయి అసలేం చేయాలో తెలియక ఫేక్ ప్రచారానికి తెరలేపింది. ఇంతకుమించి వైసీపీ దిగజారదు అనుకున్న ప్రతీసారీ.. అంతకుమించే దిగజారుగుతుండటం సిగ్గుచేటు. తాజాగా వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ పేజీలో చేసిన ఓ ట్వీట్ ఇందుకు నిదర్శనం.
చీ.. ఛీ.. ఇంత దిగజారుడా..?
‘ఇదేనా @JaiTDP సూపర్ సిక్స్ అంటే..?..
ఇదీ మీ కూటమి అసలు సత్తా.. మందూ, సిగరెట్లు, డబ్బులూ ఇస్తే తప్ప క్యాడర్ మీ సభలకు రావడం లేదు. అవన్నీ ఇచ్చి బతిమాలి తెచ్చుకున్న కూలీ జనంతో రాజకీయం చేసే మీరు ఒంటి చేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం వైయస్ జగన్ గారిని ఎదుర్కొంటారా? ఇక మీ పని అయిపోయింది, మీ కుర్చీలు మడతబెట్టి ఇళ్లకు పోండి టీడీపీ, @JanasenaParty...!’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు టీడీపీ, వైసీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తుండగా.. వైసీపీ వీరాభిమానులు కూడా ఈ ట్వీట్‌ను తప్పుబడుతుండటం కామెంట్స్‌లో చూడొచ్చు.
అఫిషియల్ అయ్యుండి..?
వైసీపీ కార్యకర్తలో.. వీరాభిమానులో.. ఇంకొకరు ఎవరో ఇలా పోస్ట్ చేశారో, వైరల్ చేస్తున్నారో అంటే ఏమైనా అనుకోవచ్చు. అధికార వైసీపీ ట్విట్టర్‌లోనే ఇలాంటి ఫేక్ ప్రచారం రావడంతో సామాన్య ప్రజలు సైతం భగ్గుమంటున్నారు. పైగా ఈ పోస్టులోని వీడియో ఎంత నీచాతి నీచంగా ఉందో చూడండి. ఒక పార్టీ అఫిషియల్ ట్విట్టర్ పేజీ అంటే ఎంత డిగ్నిటీగా ఉండాలి.. పార్టీ కార్యకర్తలగా, అభిమానిలాగా.. అంతకుమించి సైకోలాగా ఇలా ఇష్టానుసారం ఫేక్ ప్రచారాలు ఎంతవరకు సబబో ఈ ‘ఎక్స్’ను హ్యాండిల్ చేస్తున్న వారికే తెలియాలి. పోనీ.. ఇదే వైసీపీకి సంబంధించిన ఏదైనా టీడీపీ కానీ.. కార్యకర్తలు ప్రచారం అస్సలు సహించదు. చూశారుగా.. వైసీపీకి, ఆ పార్టీ నేతలకు ఎంత పైత్యం.. సైకోయిజం అనేది. ఇంకెప్పుడు వైసీపీలో మార్పు వస్తుందో.. అసలే రాదో.. చూడాలి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి