Share News

YSRCP : వైసీపీ ఇంచార్జుల రెండో జాబితా వచ్చేసింది..

ABN , Publish Date - Jan 02 , 2024 | 09:07 PM

YSRCP Second Incharges List : సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌చార్జుల మలి జాబితాను ప్రకటించేందుకు ఇన్నిరోజులు జంకిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఒకటా రెండా ఏకంగా 50 మందికిపైగా సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుందనే భయపడిపోయిన జగన్.. తీవ్ర కసరత్తులు చేసి చివరికి మంగళవారం రాత్రి జాబితాను రిలీజ్ చేశారు...

YSRCP : వైసీపీ ఇంచార్జుల రెండో జాబితా వచ్చేసింది..

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌చార్జుల మలి జాబితాను ప్రకటించేందుకు ఇన్నిరోజులు జంకిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఒకటా రెండా ఏకంగా 50 మందికిపైగా సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుందనే భయపడిపోయిన జగన్.. తీవ్ర కసరత్తులు చేసి చివరికి మంగళవారం రాత్రి జాబితాను రిలీజ్ చేశారు. 27 మందితో రెండో జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా చదివి.. పేర్లు ప్రకటించారు. సామాజిక సమీకరణాలతో గెలుపే ప్రామాణికంగా జాబితాను రిలీజ్ చేసినట్లు మంత్రి బొత్స మీడియాతో చెప్పారు.


జాబితా ఇదే..

Incharges 1.jpgIncharges 2.jpg

మొండిచేయి..

  • వైసీపీ రెండవ జాబితాలో సిట్టింగ్‌లు పలువురికి మొండిచేయి

  • పలువురి ఎమ్మెల్యేలు వారసులకు టిక్కెట్లు

  • మచిలీపట్నం, తిరుపతి, బందర్, గుంటూరు ఈస్ట్, చంద్రగిరి వంటి స్థానాల్లో వారసులకు టిక్కెట్లు

  • విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ఔట్

  • విజయవాడ వెస్ట్ నుంచి వెలంపల్లిని తప్పించిన జగన్

  • ఆయనను విజయవాడ సెంట్రల్ కు అభ్యర్థిగా నియమించిన వైసీపీ

  • విజయవాడ సెంట్రల్‌లో టికెట్ నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విష్ణు వర్గీయులు

  • విజయవాడ వెస్ట్‌లో మైనారిటీ ను రంగం లోకి దించిన జగన్

  • పలువురు ఎంపీ లను ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్న వైసీపీ

  • నేటి వరకు 38 స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసిన వైసీపీ

  • మొండిచేయి ఇచ్చిన ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న రీజినల్ కో ఆర్డినేటర్ లు

  • ఇంకా మార్పులు ఉంటాయని చెప్పిన మంత్రి botcha సత్యనారాయణ.

  • మంత్రి ప్రకటనతో మరి కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు ఆందోళన

ఆ ముగ్గరు ఎంపీలు ఇలా..!

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు ఇంచార్జీగా నియమించడంతో.. అరకు ఎంపీగా భాగ్యలక్ష్మిని వైసీపీ అధిష్టానం నియమించింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు.. రాజ్యసభ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మార్గాని భరత్‌కు కూడా రాజమండ్రి అర్బన్ ఇంచార్జీగా అధిష్టానం నియమించింది. ఈ ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం జరిగింది.


ఇదీ అసలు కథ!

వాస్తవానికి.. తొలి విడతలో 11 మంది ఇన్‌చార్జులను మార్చినప్పుడే పెద్దఎత్తున తిరుగుబాటు వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్‌పై భయంతో సదరు ఎమ్మెల్యేలు నోరెత్తకున్నా.. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఈ మార్పులను అంగీకరించడం లేదు. అయితే.. తొలి జాబితాపై పెద్దగా నిరసనలు లేవని భావించిన జగన్‌.. మలి జాబితాను ఈ నెల 2 లేదా 3న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. ఈ క్రమంలోనే ఒకరిద్దరు కీలక నేతలు పార్టీకి దూరమవ్వడం, మరికొందరు రాజీనామాకు రెడీ అవుతున్నారని తెలుసుకున్న జగన్.. అనుకూల పరిస్థితుల కోసం వేచి చూశారు. మరోవైపు.. సామాజిక పింఛన్‌ను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతున్నందున.. బుధవారం నుంచి వారం పాటు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ముంగిట కొత్త ఇన్‌చార్జులతో ఈ పంపిణీ నడిపించాలని అనుకున్నారు. అసెంబ్లీ ఇన్‌చార్జులంతా ఇందులో పాల్గొనాలనీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మలివిడత జాబితాను జగన్‌ ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు, అనుకూల చానెల్స్ కూడా ముందుగానే లీకులు చేశాయి.

Updated Date - Jan 02 , 2024 | 09:29 PM