Home » YSRCP Incharges List
ఏపీ సార్వత్రిక ఎన్నికలపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పలువురు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో జగన్‌లో ఓకింత భయం మొదలైంది. ఈ కూటమిని ఎలా ఢీకొట్టాలనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు చిత్రవిచిత్రాలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు అధికార వైసీపీలో (YSR Congress) .. ఇటు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటనలు వస్తాయో తెలియని పరిస్థితి..
AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..
Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..
వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరగా పార్థసారథి తిరస్కరించారు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మె్ల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పార్థసారథి వెనకడుగు వేయలేదు.
YSRCP Second Incharges List : సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్చార్జుల మలి జాబితాను ప్రకటించేందుకు ఇన్నిరోజులు జంకిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఒకటా రెండా ఏకంగా 50 మందికిపైగా సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుందనే భయపడిపోయిన జగన్.. తీవ్ర కసరత్తులు చేసి చివరికి మంగళవారం రాత్రి జాబితాను రిలీజ్ చేశారు...
సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్చార్జుల మలి జాబితాను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భయపడుతున్నారా?