Share News

Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 09:19 PM

సిరియాలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ధరలు కళ్లకుకట్టినట్టు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో జనాలు లబోదిబోమంటున్నారు. యుద్ధంతో అట్టుడుకుతున్న దేశాల పరిస్థితి మాత్రం చెప్పనలివి కాదు. ఇందుకు తాజా ఉదాహరణగా సరియాలో పరిస్థితిని ఓ వ్లాగర్ కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).

Viral: ఆడ సింహానికి సవాలు విసిరిన బాడీ బిల్డర్! చివరకు ఏమైందో చూస్తే..


ఎలోనా కరాఫిన్ అనే మహిళ పాప్యులర్ కంటెంట్ క్రియేటర్. నిత్యం అనేక దేశాల్లో పర్యటిస్తూ తన వీడియోలను నెట్టింట పంచుకుంటూ ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాలో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజా సిరియాలో పర్యటించిన ఆమె అక్కడి ధరలు చూసి షాకైపోయారు. ప్రజలు నోట్ల కట్టలు ఇచ్చి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఒక్క కాఫీ కప్పు కోసమే తాను 25 వేల పౌండ్లు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజలు భారీ బ్యాగుల్లో నోట్ల కట్టలు తీసుకెళుతున్న దృశ్యాలను చూసినట్టు చెప్పారు. డబ్బుకు విలువే లేకుండా పోయిందని చెప్పారు. అక్కడి రెస్టారెంట్లలోని మెనూల్లో ఫుడ్స్ పక్కన ధరలను ముద్రించరని, రోజూ రేట్లు మారుతుండటంతో ఈ తీరు అక్కడ సర్వసాధారణమైపోయిందని చెప్పారు. దీంతో, ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral: విమానం గాల్లో ఉండగా బాత్రూమ్‌లో లీకేజీ.. షాకింగ్ వీడియో


కొన్నేళ్లుగా సాగుతున్న యుద్ధంతో సిరియా అతలాకుతలమవుతున్న విషయం తెలిసింది. అంతర్జాతీయ ఆంక్షలు, బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సిరియాను ఇతర దేశాలు బహిష్కరించడంతో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పాటు క్షణక్షణానికీ మారుతుండటంతో సిరియన్ పౌండ్‌కు విలువే లేకుండా పోయింది. ఒకప్పుడు ఒక డాలర్ విలువ 50 సిరియన్ పౌండ్లుగా ఉంటే నేడు అది 15 వేల సిరియన్ పౌండ్లకు చేరుకుంది. ఫలితంగా నిత్యావసరాలు కూడా సిరియాలో లగ్జరీగా మారిపోయాయి. ప్రజల జీవన విధానం తలకిందులైంది. కరెన్సీ విలువ పతనం ఆధునిక చెల్లింపుల వ్యవస్థలను నిరుపయోగంగా మార్చేసింది. అందరూ నోట్ల కట్టలపైనే ఆధారపడటం ప్రారంభించారు. విదేశీ వస్తువుల దిగుమతులు తగ్గిపోవడంతో స్థానికంగా తయారైన వస్తువులకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలా సిరియా పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించిన ఆమె వీడియోకు ఏకంగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.

Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!

Read Latest and Viral News

Updated Date - Dec 20 , 2024 | 09:22 PM