Viral Video: ఢిల్లీలో ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్న పదేళ్ల బాలుడు.. ఆ బాలుడి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!
ABN , Publish Date - May 06 , 2024 | 04:09 PM
ఆ కుర్రాడి వయసు పదేళ్లు.. చక్కగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నేహితులతో ఆడుకోవాల్సిన వయసు.. అయితే ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు 10 ఏళ్ల వయసులోనే కుటుంబ భారం మోస్తున్నాడు.. తండ్రి చనిపోవడంతో అతడి బాధ్యతను తీసుకున్నాడు..
ఆ కుర్రాడి వయసు పదేళ్లు.. చక్కగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నేహితులతో ఆడుకోవాల్సిన వయసు.. అయితే ఢిల్లీ (Delhi)కి చెందిన ఓ కుర్రాడు 10 ఏళ్ల వయసులోనే కుటుంబ భారం మోస్తున్నాడు.. తండ్రి చనిపోవడంతో అతడి బాధ్యతను తీసుకున్నాడు.. సాయంత్రం వేళల్లో ఢిల్లీ వీధుల్లో బండి పెట్టి రోల్స్ అమ్ముతున్నాడు ( Delhi boy sells rolls).. ఓ వ్యక్తి ఆ కుర్రాడి గురించి తెలుసుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు జస్ప్రీత్ తండ్రి కొన్నేళ్ల క్రితం టీబీతో చనిపోయాడు. అప్పట్నుంచి కుటుంబ బాధ్యతను జస్ప్రీత్ తీసుకున్నాడు. ఆ బాలుడి తల్లి పంజాబ్‌లో నివసిస్తోంది. ఆ కుర్రాడి 14 ఏళ్ల అక్క.. మామయ్య ఇంట్లో ఉంటోంది. రోల్స్ చేయడం తన తండ్రి దగ్గరే నేర్చుకున్నానని, ధైర్యంగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తానని ఆ కుర్రాడు చెప్పాడు. చికెన్ రోల్, పనీర్ రోల్, కబాబ్ రోల్ మొదలైన ఎన్నో వెరైటీలు తాను చేయగలనని చెప్పాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 9.6 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుర్రాడి గురించి తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకుడు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అలాగే చాలా మంది సహాయం చేస్తామని కామెంట్లు చేశారు. ఆ కుర్రాడు ధైర్యంగా ఉండాలని చాలా మంది అభిలషించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇరాన్‌లో చేపల వర్షం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. దీని వెనుకున్న కారణమేంటి?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..