Viral Video: పిచ్చికి కూడా ఓ హద్దుండాలి భయ్యా! ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ డేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!
ABN , Publish Date - May 06 , 2024 | 02:46 PM
అమ్మాయిలను డేటింగ్‌కు తీసుకెళ్లేటపుడు ఎవరైన మంచి రొమాంటిక్ ప్లేస్‌ను ఎంచుకుంటారు. మంచి రెస్టారెంట్‌కో, పార్క్‌కో తీసుకెళతారు. ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలనే కాదు.. తన ప్రేయసి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టి ఓ వెరైటీ డేట్ ప్లాన్ చేశాడు.
అమ్మాయిలను డేటింగ్‌కు (Dating) తీసుకెళ్లేటపుడు ఎవరైన మంచి రొమాంటిక్ ప్లేస్‌ను ఎంచుకుంటారు. మంచి రెస్టారెంట్‌కో, పార్క్‌కో తీసుకెళతారు. ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలనే కాదు.. తన ప్రేయసి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టి ఓ వెరైటీ డేట్ ప్లాన్ చేశాడు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాహసోపేతమైన డేటింగ్‌కు తీసుకెళ్లాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఎవరికైనా భయం వేయక మానదు (Viral Video).
tobot_travel అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి, యువకుడు డిన్నర్ టేబుల్‌తో సహా గాల్లో ప్రయాణించారు. రెండు కొండల మధ్య కట్టిన కేబుల్ వైర్‌కు వేలాడుతూ వారు అత్యంత సాహసోపేతంగా భోజనం చేశారు. ఈ వీడియో చూడడానికే చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. 42 లక్షల మందికి పైగా లైక్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది సూసైడ్ మిషన్‌లాంటిది``, ``తేడా వస్తే ఇదే చివరి భోజనం అవుతుంది``, ``వీళ్లు నిజంగా మూర్ఖులు``, ``ఇది ప్రాణాలతో చెలగాటం``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇరాన్‌లో చేపల వర్షం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. దీని వెనుకున్న కారణమేంటి?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..