Share News

Viral Video: వామ్మో.. ఇదెక్కడి మంచం రా నాయనా.. వంద మంది ఒకేసారి కూర్చున్నా సరిపోతుందేమో..

ABN , Publish Date - Sep 07 , 2024 | 08:29 PM

సాధారణంగా గ్రామాల్లో పెద్ద పెద్ద అరుగులు నిర్మిస్తారు. లేదా కమిటీ హాళ్లు కట్టుకుంటారు. ఊరంతా అక్కడ కూర్చుని మాట్లాడకుంటారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ఓ మంచం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి మంచం రా నాయనా.. వంద మంది ఒకేసారి కూర్చున్నా సరిపోతుందేమో..
Huge Cot in Punjab

సాధారణంగా గ్రామాల్లో పెద్ద పెద్ద అరుగులు నిర్మిస్తారు. లేదా కమిటీ హాళ్లు కట్టుకుంటారు. ఊరంతా అక్కడ కూర్చుని మాట్లాడకుంటారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే పంజాబ్‌ (Punjab)లోని అమృత్‌సర్‌లో ఉన్న ఓ మంచం (Cot) గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మంచం మీద ఒకేసారి వంద మంది కూర్చుని మాట్లాడుకోవచ్చట. ఆ మంచానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @Gulzar_sahab అనే ట్విటర్‌ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. ఈ మంచానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి ఆ మంచం గురించి విశేషాలను చెబుతున్నాడు. ఆ మంచాన్ని 75 ఏళ్ల క్రితం అక్కడ ఏర్పాటు చేశారట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అంతే బలంగా ఉందట. ఆ మంచం మీద ఒకేసారి 100 మంది కూర్చున్నా ఏమీ కాదట. ప్రపంచంలో అదే అతిపెద్ద మంచం అని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఆ మంచాన్ని ప్రత్యేకమైన తాడుతో తయారు చేశారట. ఆ గ్రామంలో చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి ఆ మంచాన్నే ఆశ్రయిస్తారట. ఆ మంచానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.8 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 12 వేలకు పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. నిజంగా అద్భుతమైన మంచం`, ``పంజాబ్‌లోనే ఇలాంటి అరుదైన వాటిని చూస్తాం``, ``చాలా బాగుంది``, ``ఆ మంచాన్ని దేనితో తయారు చేశారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఎందుకమ్మా.. ఇలాంటి సాహసాలు.. వేగంగా వెళ్తున్న ట్రైన్ గేట్‌కు వెళాడుతూ యువతి డేంజరస్ స్టంట్..


Viral Video: డైరెక్ట్‌గా పాతాళ లోకానికే డెలివరీ.. రోడ్డు అడుగు నుంచి జేసీబీ ఏం బయటకు తీసిందే తెలిస్తే..


Viral Video: కోతికి కోపమొచ్చింది.. కత్తి తీసుకుని యజమాని పైనే దాడికి దిగింది.. వీడియో వైరల్..


Viral: గాళ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లేందుకు పెయిడ్ లీవ్.. థాయ్ కంపెనీ వినూత్న ఆలోచన.. కారణమేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2024 | 08:29 PM