Share News

Viral Video: ఎందుకమ్మా.. ఇలాంటి సాహసాలు.. వేగంగా వెళ్తున్న ట్రైన్ గేట్‌కు వెళాడుతూ యువతి డేంజరస్ స్టంట్..

ABN , Publish Date - Sep 07 , 2024 | 08:14 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తూ తమ పాపులారిటీ పెంచుకోవడానికి చూస్తున్నారు. అందుకోసం అవసరమైతే ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలు కావడం జరుగుతోంది.

Viral Video: ఎందుకమ్మా.. ఇలాంటి సాహసాలు.. వేగంగా వెళ్తున్న ట్రైన్ గేట్‌కు వెళాడుతూ యువతి డేంజరస్ స్టంట్..
Girl performing a dangerous stunt

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తూ తమ పాపులారిటీ పెంచుకోవడానికి చూస్తున్నారు. అందుకోసం అవసరమైతే ప్రాణాంతక సాహసాలు (Dangerous Stunts) చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలు కావడం జరుగుతోంది. అయినా చాలా మంది ఆ మోజు నుంచి బయటకు రావడం లేదు. తాజాగా ఓ యువతి వేగంగా వెళ్తున్న రైలు (Train) గేటుకు వేళాడుతూ వీడియో తీసుకుంది. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. @ChapraZila అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


తాజాగా ఓ అమ్మాయి కదులుతున్న రైలులో విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలిచింది. తన జీవితం గురించి కూడా పట్టించుకోకుండా రైలు డోర్‌కు వేలాడుతూ విన్యాసాలు చేసింది. ఆమె రైల్వే గేట్ హ్యాండిల్స్‌ని చేతులతో పట్టుకుని బయటకు వేలాడుతూ కనిపించింది. రైలు ఆ సమయంలో చాలా వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చేయి జారితే పరిస్థితి ఊహించడం కూడా కష్టమే. చివరకు అమ్మాయి సురక్షితంగా రైలు లోపలికి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వైరల్ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఉన్న ఒక్క లైఫ్‌ను ఇలాంటి పనులు కోసం రిస్క్‌లో పెట్టొద్దు``, ``డియర్ సిస్టర్.. మీరు చేస్తోంది తప్పు``, ``ఎంత ప్రమాదకరం``, ``రైల్వే పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: డైరెక్ట్‌గా పాతాళ లోకానికే డెలివరీ.. రోడ్డు అడుగు నుంచి జేసీబీ ఏం బయటకు తీసిందే తెలిస్తే..


Viral Video: కోతికి కోపమొచ్చింది.. కత్తి తీసుకుని యజమాని పైనే దాడికి దిగింది.. వీడియో వైరల్..


Viral: గాళ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లేందుకు పెయిడ్ లీవ్.. థాయ్ కంపెనీ వినూత్న ఆలోచన.. కారణమేంటంటే..


Optical Illusion: ఈ పజిల్‌ను కేవలం 1 శాతం మందే పరిష్కరించగలిగారు.. ఈ ఫొటోలోని పులిని కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2024 | 08:14 PM