Share News

Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..

ABN , Publish Date - Dec 16 , 2024 | 09:53 PM

ఆ జంట దాదాపు 43 కలిసి జీవిన ప్రయాణం సాగిస్తున్నారు. ఇన్నేళ్లల్లో ఏకంగా 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు. ఇది వారి మధ్య ప్రేమకు తార్కాణం అనుకుంటే పొరబడట్టే. ఓ ప్రభుత్వ పథకంలో లొసుగును అడ్డం పెట్టుకుని వారు ఇలాంటి నాటకానికి తెర తీశారని తెలిసి అధికారులు కూడా షాకైపోయారు.

Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ జంట దాదాపు 43 కలిసి జీవిన ప్రయాణం సాగిస్తున్నారు. ఇన్నేళ్లల్లో ఏకంగా 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు. ఇది వారి మధ్య ప్రేమకు తార్కాణం అనుకుంటే పొరబడట్టే. ఇదంతా వారు డబ్బు కోసం ఆడిన డ్రామా. ఓ ప్రభుత్వ పథకంలో లొసుగును అడ్డం పెట్టుకుని వారు ఇలాంటి నాటకానికి తెర తీశారని తెలిసి అధికారులు కూడా షాకైపోయారు. ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..

Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు


భర్త పోయిన మహిళలకు ఆస్ట్రియా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంటుంది. ఇందులో భాగంగా అర్హులైన మహిళలు ఇలా ఒంటరైన సందర్భాల్లో ఏటా 28,300 డాలర్ల ఆర్థిక సాయాన్ని పొందుతారు. అయితే, ఈ ఆర్థిక సాయం డైవర్స్ తీసుకున్న మహిళలకు ఇస్తారు. దీన్ని అడ్డం పెట్టుకున్న జంట ప్రభుత్వానికి టోకరా ఇచ్చేందుకు ఈ కొత్త ప్లాన్ వేసింది.

ఆ జంట డైవర్స్ తీసుకున్న రెండు మూడేళ్ల పాటు మళ్లీ పెళ్లి చేసుకునేవారు. ఆ తరువాత మళ్లీ డైవర్స్ తీసుకునే వారు. ఇలా గత 43 ఏళ్లుగా వాళ్లు నాటకమాడుతున్నారు.

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!


ఇటీవల సదరు మహిళ 12వ సారి తన భర్తకు డైవర్స్ ఇచ్చేసింది. ఆ తరువాత యథావిధిగా పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలో అధికారులు ఆమె గురించి విచారించగా జంట నడుపుతున్న నాటకం వెలుగులోకి వచ్చింది. వారి బండారం బయట పడటంతో అధికారులు జంట మోసానికి పాల్పడ్డారంటూ కేసు ఫైల్ చేశారు.

దీంతో, ఆ జంట ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకంలో లోపాలను అడ్డుపెట్టుకుని అప్పనంగా ఆ జంట ప్రజాధనం దుర్వినియోగపరచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఉదంతంతో షాక్‌కు గురైన అధికారులు ఇతర జంటలు కూడా ఇలాంటి మోసాలకేమైనా తెరతీశాయోమో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద ఉదంతాలు వెతికి తీస్తూ ఒక్కో అబ్ధిదారు చరిత్రను నిశితంగా పరిశీలిస్తు్న్నారు.

Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం

Read Latest and Viral News

Updated Date - Dec 16 , 2024 | 09:53 PM