Share News

UP: స్కూల్‌ మూసేస్తే సెలవులొస్తాయని 9 ఏళ్ల బాలుడి హత్య!

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:01 AM

స్కూల్ మూసేస్తే సెలవుల్లో ఇంటికెళ్లొచ్చని ఓ 13 ఏళ్ల బాలుడు 9 ఏళ్ల విద్యార్థిని హత్య చేసిన షాకింగ్ ఉదంతం యూపీలో వెలుగు చూసింది. హత్య జరిగిన రెండు నెలలకు నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

UP: స్కూల్‌ మూసేస్తే సెలవులొస్తాయని 9 ఏళ్ల బాలుడి హత్య!

ఇంటర్నెట్ డెస్క్: సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో కానీ చిన్నారుల మనసులు కూడా నేటి జమానాలో కలుషితమైపోతున్నాయి. తెలిసీ తెలియని వయసులోనే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం దేశంలో ఏదో మూల వెలుగు చూస్తున్నాయి. స్కూలు మూసేస్తే సెలవులు వస్తాయన్న ఉద్దేశంతో 13 ఏళ్ల బాలుడు మరో 9 ఏళ్ల బాలుడిని హత్య చేసిన దారుణ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన రెండు నెలలకు ఘటన వెనక కారణాలను పోలీసులు గుర్తించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారితీస్తోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, హత్రాస్‌లో సెప్టెంబర్ 26న ఓ 9 ఏళ్ల బాలుడు స్కూలు ఆవరణలో హత్యకు గురయ్యాడు. స్కూలు డైరెక్టర్ కారులో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది (Viral).

Viral: మాంజాకు చిక్కుకున్న పావురాయిని కాపాడిన మానవతామూర్తులు!


స్కూలుకు పేరు రావాలనే ఉద్దేశంలో బాలుడిని నిందితులు బలి ఇచ్చి ఉంటారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారంగా ఇలా చేసుండొచ్చని కొందరు అనుమానించారు. ఈ క్రమంలో పోలీసులు ఐదుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారు. హత్య, ఆధారాలు ధ్వంసం చేయడం వంటి అభియోగాలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్కూలు విద్యార్థులను కూడా ఒక్కొక్కరిగా ప్రశ్నించసాగారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Viral: మీ వల్లే నాకీ జాబ్ వచ్చింది.. భారతీయ సీఈఓపై ప్రశంస


స్కూల్ మూసేయాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులను కనుక్కున్న వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో, అతడిని పిలిపించి ప్రశ్నించగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తానే ఈ హత్య చేసినట్టు సదరు బాలుడు అంగీకరించాడు. టవల్‌తో అతడిని ఊపిరాడకుండా చేసి అంతమొందించినట్టు చెప్పాడు. హత్యకు ముందు బాలుడు చేతిలో టవల్‌తో స్కూలు పరిసరాల్లో సంచరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తరువాత అతడు తనకు భయమేస్తోందంటూ మరో విద్యార్థిని తన పక్కనే నిద్రించమని చెప్పినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు జువెనైల్ డిటెన్షన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

‘‘పిల్లాడు చనిపోతే స్కూలు మూసేస్తారని, అప్పుడు తాను ఇంటికి వెళ్లొచ్చని విద్యార్థి అనుకున్నాడు’’ అని ఎస్పీ చిరంజీవ్ నాథ్ సిన్హా గురువారం పేర్కొ్న్నారు. ఈ షాకింగ్ విషయం తెలిసి స్థానికంగా పెను కలకలం రేగింది.

Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..

Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!

Read Latest and Viral News

Updated Date - Dec 27 , 2024 | 10:09 AM