Broken Arrow: అణుబాంబులను పోగొట్టుకున్న అమెరికా..!
ABN , Publish Date - Feb 26 , 2024 | 08:54 PM
అమెరికా మొత్తం మూడు అణుబాంబులను పోగొట్టుకుందట. వాటి జాడ ఇప్పటికీ ప్రపంచానికి తెలీదని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: యస్..మీరు చుదువుతున్నది నిజమే. అమెరికా (USA) కొన్ని అణుంబాబులను పోగొట్టుకుంది. ఇవి జపాన్‌పై ప్రయోగించిన అణుబాంబుల కంటే 70 రెట్లు శక్తిమంతమైనవట. ప్రస్తుతం ఇవి సముద్రగర్భంలో ఉన్నాయంటూ బీబీసీ కొంతకాలం క్రితం ఓ కథనం ప్రచురించింది (America Lost 3 Nukes). మరి ఈ అణ్వాయుధాలను అమెరికా ఎప్పుడు కోల్పోయిందో, ఎలా కోల్పయిందో తెలుసుకుందాం పదండి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, 1958 - 1968 మధ్య మూడు ఘటనలు వెలుగు చూశాయి. అప్పట్లో కనిపించకుండా పోయిన అణుబాంబులు ఆచూకీ ఇప్పటివరకూ దొరకలేదట. ఈ ఘటనలను మిలిటరీ పరిభాషలో బ్రోకెన్ యారో ఉదంతాలుగా పిలుస్తారు. వాస్తవానికి 1950ల తరువాత డజనకు పైగా బ్రోకెన్ యారో (Broken Arrow) ఘటనలు జరిగినా మూడు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కాయట.
1958లో తొలిసారి జార్జియాలోని టైబీ ఐల్యాండ్ వద్ద బ్రోకెన్ యారో ఘటన వెలుగు చూసింది. ఓ విమానం ల్యాండయ్యే క్రమంలో భద్రతా కారణాల రీత్యా అణుబాంబును కిందకు జార విడిచింది. 1965లో ఓ నౌకపై ఉన్న అణుబాంబు ఫిలిప్పైన్స్ సముద్రంలో పడిపోయింది. నేటి వరకూ అది కనిపించలేదు. ఇక 1968లో చివరిగా సారి రెండు అణుబాంబులు కనిపించకుండా పోయాయి. అప్పట్లో ఓ జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోవడంతో అందులోని రెండు అణుబాంబు ఆధారిత టార్పిడోలు కనుమరుగయ్యాయి. ఇలా మిస్సైన అణుబాంబులను కనుగొనేందుకు అమెరికా చాలా ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. దీంతో, అవి ప్రమాదవశాత్తూ పేలితే పెద్ద అనర్థం జరుగుతుందని ప్రపంచమంతా భయపడిపోయింది.
Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ అధికారని తెలీక..
అణుబాంబులు కనిపించకుండా పోవడం వెనక కారణాలపై కూడా ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ ఘటనల వెనక కుట్రకోణం ఉందని కొందరు అంటారు. అసలేం జరిగిందే ప్రభుత్వం దాడిపెడుతోందని అనుమానిస్తుంటారు. అయితే, అణుబాంబులు పేలే అవకాశం మాత్రం చాలా తక్కువనేది నిపుణుల అభిప్రాయం. అణ్వాయుధాలతో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో ఈ ఘటనలు నిరూపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి