Share News

Viral Video: డ్రైనేజ్‌లో భారీ సర్పం.. దానిని పట్టుకోవడానికి ఆ వ్యక్తి ఉపయోగించిన ట్యాలెంట్ చూస్తే అభినందించాల్సిందే..

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:57 PM

ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయంతో వణికిపోతారు. ఇక, భారీ విష సర్పాలు ఎదురైతే పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే కొద్ది మంది మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు.

Viral Video: డ్రైనేజ్‌లో భారీ సర్పం.. దానిని పట్టుకోవడానికి ఆ వ్యక్తి ఉపయోగించిన ట్యాలెంట్ చూస్తే అభినందించాల్సిందే..
Catching a snake

ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయంతో వణికిపోతారు. ఇక, భారీ విష సర్పాలు ఎదురైతే పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే కొద్ది మంది మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములను పట్టుకుని (Snake Catcher) వాటి ప్రాణాలను, మనుషుల ప్రాణాలను కాపాడతారు. అయితే పాములు పట్టుకోవడం అంత సులభం కాదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా దాని కాటుకు బలి కావాల్సిందే. ఒక భారీ సర్పాన్ని పట్టుకునేందుకు ఓ వ్యక్తి ఉపయోగించిన టెక్నిక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ 18 అడుగుల భారీ సర్పం భూగర్భ డ్రైనేజీలో దాక్కుని ఉంది. దానిని బయటకు తీసేందుకు పాములు పట్టే నిపుణులు వచ్చారు. అయితే ఆ పాము తల పైపులో ఇరుక్కుపోయింది. ఆ తలను సురక్షితంగా బయటకు తీశారు. తల బయటకు వచ్చిన మరుక్షణమే ఆ పాము ఆగ్రహంతో పడగ విప్పి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. చాలా సేపు అతడికి దొరక్కుండా ఉండేందుకు పాము ప్రయత్నించింది. అయితే ఆ వ్యక్తి చాకచక్యంగా పాము తలను పట్టుకున్నాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మంది వీక్షించారు. 11 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ పామును చూస్తేనే భయం వేస్తోంది``, ``ఈ పని చేయడానికి చాలా ధైర్యం కావాలి``, ``నాగుపాము రియాక్షన్ వేగం మానవుడి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ బ్రెయిన్ స్పీడ్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో మేకుల మధ్య ఉన్న స్ప్రింగ్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: స్టూడెంట్ ఇలా రాస్తే టీచర్ మాత్రం ఏం చేస్తుంది.. మార్కులు వేయకుండా ఉంటుందా? వైరల్ అవుతున్న ఆన్సర్ షీట్!


Viral Video: అర్జెంట్ అని వెళితే స్మార్ట్ టాయిలెట్ ఎంత పని చేసిందో చూడండి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!


Viral: తులం బంగారం ధర 1959లో ఎంతో తెలుసా? విపరీతంగా వైరల్ అవుతున్న పాత గోల్డ్ బిల్..!

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2024 | 03:57 PM