Viral: చెత్త కుండీలో కరెన్సీ నోట్ల కట్టలు.. అసలు విషయం తెలియక పిల్లల్లో సంబరం!
ABN , Publish Date - Dec 31 , 2024 | 02:41 PM
చెత్త కుండీలో పాత నోట్ల కట్టలు లభించడంతో ఇద్దరు చిన్నారుల సంబరం అంబరాన్ని అంటింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ రోజు ఉదయం మీ ఇంటి ముందు నోట్ల కట్టలతో నిండిన బ్యాగు కనిపిస్తే.. మీ ఆశ్చర్యం అంబరాన్ని అంటుతుంది కదూ! చెత్త ఏరుకుని జీవనం సాగించే ఇద్దరు పిల్లలకు ఇటీవల దాదాపు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో, వారి సంబరం అంబరాన్ని అంటగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అవి చెల్లని నెట్లని తెలిశాక కూడా వారు సంబరం చేసుకోవడం జనాలను మరింతగా ఆకర్షించింది (Viral).
చెత్త ఏరుకుంటున్న ఇద్దరు పిల్లలకు ఓ బ్యాగులో భారీగా నోట్ల కట్టలు లభించాయి. అవన్నీ రద్దైపోయిన రూ.500 నోట్ల కట్టలే. ఈవేమీ మొదట తెలియని పిల్లల్లో ఒక్కసారిగా ఆనందం ఆకాన్నంటింది. చేతుల నిండా కరెన్సీ కట్టలు పట్టుకుని చూసుకుంటూ మురిసిపోయారు. తాము ధనవంతులమైపోయామని అనుకున్నారు. ఇంతలో దారినపోయే వ్యక్తి ఇదంతా చూసి వారి వద్దకు వెళ్లారు. చిన్నారుల సంబరాన్ని కెమెరాలో రికార్డు చేశాడు.
Viral: పబ్‌లో నూతన సంవత్సర వేడుకలు.. అతిథులకు కండోమ్స్ గిఫ్ట్‌గా పంపి ఆహ్వానాలు!
ఈ క్రమంలో తనకు కొన్ని నోట్లు ఇవ్వమని వారిని అడగ్గా ఆ చిన్నారులు ఏమాత్రం సంశయించకుండా ఇచ్చేశారు. ఆ తరువాత సదరు వ్యక్తి వారికి అసలు విషయం చెప్పాడు. అవన్నీ చెల్లని నోట్లని, నిరుపయోగమని వివరించాడు. దీంతో, క్షణకాలం పాటు నిరాశపడ్డ ఆ చిన్నారుల ముఖంలో ఆ మరుక్షణమే సంబరం వెల్లివిరిసింది. నోట్ల చెల్లనివైనా సరే తమ ఆనందం కోల్పోదలుచుకోలేదన్నట్టు జనాలకు ఆ నోట్లను చూపిస్తూ సంబరపడ్డారు. వాటిని ముద్దాడారు.
Viral: నీటి ప్రవాహాన్ని దాటేందుకు వంతెన నిర్మించిన చీమలు! వైరల్ వీడియో!
వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. పిల్లల అమాయకత్వం చూసి మురిసిపోయారు. వాళ్లకు జీవితంలో సకల ఐశ్యర్యాలు సొంతం కావాలని కొందరు ఆకాంక్షించారు.
రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం 2016 నవంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. పౌరులు తమ వద్ద ఉన్న పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లను తీసుకునేందుకు ప్రభుత్వం అప్పట్లో అవకాశం ఇచ్చింది. ఆ గడవు ఇప్పటికే ముగిసిపోయిన తరుణంలో పాత నోట్లు ఇకపై మార్పిడి చేసుకునేందుకు ఎంతమాత్రం కుదరదు.
Viral: బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు.. యువ ఉద్యోగి ఆవేదన
Viral: నీటి ప్రవాహాన్ని దాటేందుకు వంతెన నిర్మించిన చీమలు! వైరల్ వీడియో!