NRI: ఇక్కడకొచ్చి తప్పు చేశానేమో! న్యూజిలాండ్‌లో భారతీయ యువకుడి ఆవేదన
ABN , Publish Date - Oct 25 , 2024 | 03:05 PM
న్యూజిలాండ్‌లో సెటిలయ్యేందుకు వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడి జాత్యాహంకార పోకడలకు దిమ్మెరపోయాడు. ఆశలన్నీ అడియాశలవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన అతడు తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌లో సెటిలయ్యేందుకు వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడి జాత్యాహంకార పోకడలకు దిమ్మెరపోయాడు. ఆశలన్నీ అడియాశలవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన అతడు తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: యువరాజ్ సింగ్ ఎన్జీవో యాడ్.. విమర్శలు
“Lopsided_Tennis69” పేరిట అతడు న్యూజిలాండ్‌లో పరిస్థితులను నెటిజన్లకు కళ్లకుకట్టినట్టు వివరించారు. ‘‘నా వయసు ప్రస్తుతం 29 ఏళ్లు, రెండేళ్ల క్రితం ఎన్నో ఆశలతో ఇక్కడే సెటిలవుదామని వచ్చా. న్యూజిలాండ్ అంటే బహుళ సంస్కృతులకు నిలయం అని మొదట్లో అనుకునే వాడిని. ఇక్కడ కొత్త జీవితం మొదలెట్టొచ్చని అనుకున్నా. కానీ వాస్తవం మాత్రం చాలా భిన్నంగా ఉంది. నా అనుభవాలను మీతో షేర్ చేసుకునేందుకు, నా పరిస్థితుల్లో ఉన్న మిగతా వారు ఎలా నెట్టుకొస్తున్నారో తెలుసుకునేందుకు ఈ పోస్టు పెడుతున్నా’’
Viral: వీడ్కోలు కౌగిలింతలకు టైం లిమిట్! న్యూజిలాండ్ ఎయిర్ పోర్టు ఆదేశాలు!
‘‘ఇక్కడకొచ్చాక చాలా సార్లు జాత్యాహంకార ధోరణిని ఎదుర్కొన్నా. రోడ్డు మీద వెళుతుంటే ముక్కూ ముఖం తెలీని వాళ్లు నాపై నోరు పారేసుకునేవారు. నా ఉచ్చారణ, రూపురేఖలు భిన్నంగా ఉండటంతో పని ప్రదేశంలో కూడా తేడాగా చూస్తుండేవారు. పార్టీల్లో కూడా నన్ను మిగతా వారు దూరం పెట్టినట్టు అనిపించేది. వారి సంభాషణల్లో నన్ను కలుపుకోకపోవడం, నేను మాట్లాడుతుంటే అమర్యాదకరంగా అడ్డుపడటం వంటివి కొందరు చేశారు. ఒక సందర్భంలో ఓ వ్యక్తి నన్ను ఇండియాకు వెళ్లిపోమంటూ ముఖం మీదే అత్యంత అవమానకరంగా చెప్పేశాడు’’
Viral: వీడ్కోలు కౌగిలింతలకు టైం లిమిట్! న్యూజిలాండ్ ఎయిర్ పోర్టు ఆదేశాలు!
‘‘నేను స్థానిక కీవీ యాస, పదబంధాలను నేర్చుకునేందుకు ప్రయత్నించా. సానుకూల దృక్పథంతోనే అక్కడి సంస్కృతి, ప్రజల తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. కానీ ఒక్కోసారి నన్ను నిరాశ ఆవహిస్తుంది. ఇక్కడ రెండేళ్ల నుంచీ ఉంటున్నా నేను బయటవాడినన్న భావం వదలట్లేదు. మీలో ఇలాంటి పరిస్థితిని ఎవరైనా ఎదుర్కొన్నారా? ఎలా తట్టుకునే వారు? న్యూజిలాండ్‌లో సెటిలవ్వాలనే ఇక్కడకు వచ్చా. కానీ ఊహించని పరిస్థితులు ఎదురుకావడంతో ఇబ్బందికంగా మారింది. అసలు నేను న్యూజిలాండ్‌ను ఎన్నుకోవడం సరైనదేనా అనే సందేహం చాలా సార్లు కలుగుతుంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతోంది. భవిష్యత్తులో పరిస్థితి ఎన్నటికైనా చక్కబడుతుందా?’’ అంటూ తన ఆవేదన అంతా వెళ్లగక్కాడు.
Viral: బట్టతలను జయించిన మిలియనీర్! ఈయన టెక్నిక్ ఏంటంటే..
కాగా, ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన మరో భారతీయుడు కూడా తాను జాత్యాహంకారం ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చాడు. తన రూపురేఖల కారణంగా అక్కడి వారు తనను ఇబ్బంది పెట్టేలా చూసేవారని, ముఖ్యంగా తన గోధుమ రంగు మేని ఛాయ అక్కడి వారికి తేడాగా అనిపించేదని తెలిపాడు. అయితే, భారతీయులతో పాటు అమెరికన్లను కూడా స్థానికులు ఇలాగే ట్రీట్ చేస్తాన్నాడు.