Viral: ఆడ తోడు లేని మగాళ్లే ఆమె టార్గెట్! ఫేక్ కేసులతో రూ.1.25 కోట్లు లూటీ!
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:55 PM
ఆడ తోడు లేని ధనికులను పెళ్లి చేసుకుని ఆపై కేసులు పెట్టి సెటిల్మెంట్ల పేరిట డబ్బులు దండుకుంటున్న ఓ కిలాడీ మహిళను ఉత్తరాఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవిత భాగస్వామి మరణించడం లేదా విడాకులు తీసుకుని ఒంటరిగా మిగిలిన ధనికులే ఆమె టార్గెట్. మాట్రిమోనియల్ సైట్లల్లో ఇలాంటి ప్రొఫైల్స్‌ను ఎంచుకుని మరీ వల విసురుతుంది. తన వలలో పడ్డ వ్యక్తిని తొలుత పెళ్లాడి ఆ తరువాత విడాకులకు పట్టుబట్టి, పలు కేసులు బనాయించి చివరకు సెటిల్మెంట్ల పేరిట లక్షలు దండుకుని ఉండాయిస్తుంది. ఇలా పక్కా ప్లాన్‌తో రూ.1.25 కోట్లు దోచుకున్న మహిళ తాజాగా కటకటాల పాలైంది. ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
Viral: పెంగ్విన్‌లు ఇలాక్కూడా చేస్తాయా? తన దారికి అడ్డుగా మనుషులుంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తోడు కోసం అన్వేషిస్తున్న పురుషులను సీమా అలియాస్ నిక్కీ అనే మహిళ టార్గెట్ చేసుకునేది. 2013లో తొలిసారి ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది . ఆ తరువాత అతడిపై, అతడి కుటుంబంపై కేసు దాఖలు చేసింది. చివరకు రాజీ చేసుకునేందుకు ఏకంగా రూ.75 లక్షలు వసూలు చేసి అతడిని వదిలిపెట్టింది. ఆ తరువాత 2017లో సీమా గురుగ్రామ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వలవేసి పట్టుకుంది. అతడితో వివాహం.. ఆపై కేసులు.. చివరకు సెటిల్మెంట్ పేరిట రూ.10 లక్షలు పుచ్చుకుంది. ఆమె పీడ విరగడైనందుకు ఆ ఇద్దరు సంతోషించారు కానీ నిందితురాలి అసలు ప్లాన్ మాత్రం గుర్తించలేకపోయారు.
Jeff Bezos Wedding: నా పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చా.. పచ్చి అబద్ధం: జెఫ్ బెజోస్
ఇలా రెండు మార్లు విజయం దక్కిన ఉత్సాహంలో సీమా మరోసారి తన పాత వ్యూహాన్ని ప్రయోగించింది. గతేడాది జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారిని మళ్లీ పెళ్లి చేసుకుంది. కారణమేంటో తెలీదు కానీ పెళ్లి తరువాత కొంత కాలానికే ఇంట్లోని నగలతో ఆమె ఉడాయించింది. మొత్తం రూ.36 లక్షల నగదు, నగలతో జంపైపోయింది. దీంతో, వారు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఈ కిలేడీ ఉదంతం బట్టబయలైంది.
ఆమె మాట్రిమోనియల్ సైట్ల ద్వారా మగాళ్లకు వలవేసేదని తెలిపారు. భార్యలు పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న బిజినెస్ వ్యక్తులే ఆమె టార్గెట్ అని వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని ధనవంతులను పెళ్లి చేసుకుని ఆమై కేసులతో బెదిరించి రూ.1.25 కోట్లు దండుకుందని అన్నారు.
Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు