Share News

Walking: ఉదయాన కసరత్తులు చేసే వారికి అనువైన 3 రకాల వాకింగ్ స్టైల్స్!

ABN , Publish Date - Dec 11 , 2024 | 09:41 PM

ప్రస్తుతం మార్నింగ్ వాకింగ్ చేసేవారు.. నార్డిక్ వాక్, బ్రిస్క్ వాక్, చీ వాక్‌లను ఎక్కువగా అనుసరిస్తున్నారు. వీటిల్లో ఏది ఉంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Walking: ఉదయాన కసరత్తులు చేసే వారికి అనువైన 3 రకాల వాకింగ్ స్టైల్స్!

ఇంటర్నెట్ డెస్క్: అత్యధిక ప్రయోజనాలు ఇచ్చే అత్యంత సులువైన కసరత్తు వాకింగ్. అయితే, నడకల్లోనూ వివిధ రకాలు ఉన్నాయి. వ్యక్తులు తమ లక్ష్యాలు, శరీర తత్వాన్ని అనుసరించి వాకింగ్ స్టైల్స్‌‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్నింగ్ వాకింగ్ చేసేవారు.. నార్డిక్ వాక్, బ్రిస్క్ వాక్, చీ వాక్‌లను ఎక్కువగా అనుసరిస్తున్నారు. వీటిల్లో ఏది ఉంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).

Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!


బ్రిస్క్ వాక్!

ఉదయాలను ఉత్సాహంగా ప్రారంభించేందుకు బ్రిస్క్ వాక్ అత్యుత్తమం. ఇది కాస్త వేగవంతమైన నడక. ఈ నడకతో కాస్త ఆయాసంతో పాటు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. బ్రిస్క్ వాకింగ్‌లో నిమిషానికి 100 అడుగులు వేయాల్సి ఉంటుంది. అంటే.. గంటకు 2.7 మైళ్ల వేగం అన్నమాట. సాధారణ నడకతో పోలిస్తే బ్రిస్క్ వాకింగ్‌లో అదనపు కెలరీలు ఖర్చవుతాయి. దీంతో గుండె ఆరోగ్యం కండరాలు మెరుగవుతాయి. మధ్యస్త తీవ్రత కలిగిన కసరత్తులు కావాలనుకునే వారికి బ్రిస్క్ వాకింగ్ తగినది.

నార్డిక్ వాక్..

ఈ నడకలో శరీరం పైభాగానికి కూడా కసరత్తు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ తరహా వాకింగ్‌ కోసం రెండు చేతులతో కర్రలు పట్టుకుని నడవాల్సి ఉంటుంది. దీంతో, చేతులు వేగంగా కదిలి నడుముకు పైభాగం మొత్తానికి లాభిస్తుంది. స్ట్రెన్త్ ట్రెయినింగ్, ఎయిరోబిక్ కసరత్తుల కలయికగా నిపుణులు దీన్ని అభివర్ణిస్తారు. వివిధ రకాల ఫిట్‌నెస్ స్థాయిలు ఉన్న వాళ్లకు ఇది అనుకూలం. చేతులు, కాళ్లను లయబద్ధంగా ఊపుతూ నడవడమే ఈ నార్డిక్ వాక్ ప్రధాన లక్షణం. నార్డిక్ వాక్‌తో శరీరంలోని 90 శాతం కండరాలు ఉత్తేజితమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి కసరత్తని నిపుణులు చెబుతున్నారు.

Ghee - Skincare: చలికాలంలో నెయ్యిని ఇలా వాడితే అన్నీ బెనిఫిట్సే!


చీ వాక్..

ఇది వాకింగ్‌లో ఓ విప్లవాత్మకమైన మార్పు అని నిపుణులు చెబుతున్నారు. తాయ్‌చీ అనే మార్షియల్ ఆర్ట్‌లోని కొన్ని మౌలిక సూత్రాలను నడకకు జత చేసి చీ వాక్ ఉనికిలోకి వచ్చింది. ఈ తరహా వాకింగ్‌లో శరీరం, బ్యాలెన్స్, పోశ్చర్, కెలొరీల ఖర్చుల ప్రభావశీలతకు ప్రాధాన్యం ఎక్కువ. ఎక్కువ కష్టపడకుండానే చేసే కసరత్తుల్లో ఇదీ ఒకటి. దీంతో, ఒత్తిడి కూడా తగ్గిపోతుందని నిపుణుల చెబుతున్నారు. కీళ్లపై ఒత్తిడి తగ్గేలా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి ఇది కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఇతర కదలికలకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఇది అత్యంత అనుకూలం.

Read Latest and Health News

Updated Date - Dec 11 , 2024 | 10:40 PM