Share News

Viral: ఇదెక్కడి విడ్డూరం.. భర్తను, పిల్లలను వదిలేసి 70 ఏళ్ల మామను పెళ్లి చేసుకున్న కోడలు..

ABN , Publish Date - Jul 31 , 2024 | 08:50 PM

ప్రేమ గుడ్డిది అంటారు.. ఇప్పటివరకు దీనిని నమ్మకపోతే ఈ ఘటన గురించి తెలిశాక నమ్మక తప్పదు. వావివరసలు లేకుండా, వయసు తారతమ్యాలు పట్టించుకోకుండా ఇటీవలి కాలంలో కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అలాంటి ఓ వింత వివాహం జరిగింది.

Viral: ఇదెక్కడి విడ్డూరం.. భర్తను, పిల్లలను వదిలేసి 70 ఏళ్ల మామను పెళ్లి చేసుకున్న కోడలు..
Father-in-law marries Daughter-in-law

ప్రేమ (Love) గుడ్డిది అంటారు.. ఇప్పటివరకు దీనిని నమ్మకపోతే ఈ ఘటన గురించి తెలిశాక నమ్మక తప్పదు. వావివరసలు లేకుండా, వయసు తారతమ్యాలు పట్టించుకోకుండా జరుగుతున్న కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో జరిగిన అలాంటి ఓ వింత వివాహం చాలా మందికి షాక్‌ కలిగిస్తోంది. 70 ఏళ్ల వృద్ధుడు (Father-in-law) తన కోడలితోనే ప్రేమలో పడ్డాడు. తన కొడుకు భార్య అనే ఇంగితం కూడా లేకుండా కోడలితో (Daughter-in-law) ప్రేమాయణం నడిపించాడు. చివరకు ఆమెను వివాహం (Strange Marriage) చేసుకున్నాడు.


ఉత్తరప్రదేశ్‌లోని మౌతీ అనే గ్రామానికి చెందిన 70 ఏళ్ల హరిశంకర్ అనే వ్యక్తి తన సొంత కోడలితో కలిసి ఇంటి నుంచి పరారయ్యాడు. చాలా రోజులు వేరే చోట కలిసి బతికిన వీరు ఆదివారం హఠాత్తుగా ఊరిలో ప్రత్యక్షమయ్యారు. గ్రామంలో ఉన్న ఓ ఆలయానికి చేరుకుని దేవుడి ముందు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వార్త విని అందరూ షాక్‌ అయ్యారు.. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని ఈ వింత వివాహాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


వృద్ధుడైన మామను పెళ్లి చేసుకున్న ఆ 35 ఏళ్ల మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి. హరిశంకర్‌కు ఐదుగురు కుమారులు. వారిలో పెద్ద కొడుకు భార్యతో చాలా ఏళ్ల కిందటే ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత వివాహం గురించి తెలుసుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలి వెళ్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: కలియుగ శ్రవణ కుమారుడు.. తల్లిదండ్రులను మోసుకెళ్తున్న కొడుకుపై విమర్శలు ఎందుకంటే..!


Picture Puzzle: మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ హైకింగ్ ఫొటోల్లోని 3 తేడాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెరైటీ లంచ్ ప్యాక్.. అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2024 | 08:56 PM