Share News

Viral: 65 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల వాడిలా మారిపోయాడుగా! షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Aug 27 , 2024 | 08:43 PM

మేకప్‌తో ఎలాంటి అద్భుతాలు సాధ్యమో చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మేకప్‌ వేసుకున్నాక ఓ వృద్ధుడు 35 ఏళ్ల వాడిలా కనిపించడం చూసి జనాలు షాకైపోతున్నారు. ఇది నిజమేనా అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Viral: 65 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల వాడిలా మారిపోయాడుగా! షాకింగ్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన ప్రతి జీవికీ వృద్ధాప్యం సహజం. అయితే, నచ్చిన విధంగా బతకాలని కోరుకునే మనిషి వృద్ధాప్యంపై కూడా పోరాటం చేస్తున్నాడు. ఆధునిక సాంకేతికత ఆసరాగా ముసలితనాన్ని కనీసం కొన్నేళ్ల పాటు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓ మోస్తరు విజయాలు సాధిస్తున్నాడు. అయితే, మేకప్‌తో ఇంతకంటే సులువుగా వయసు కనబడకుండా చేయొచ్చని ఇప్పటికే అనేక మంది రుజువు చేశారు. ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షి్స్తోంది (Viral). వీడియోలోని ఓ మేకప్ ఆర్టిస్టు.. 65 ఏళ్ల వృద్ధుడిని 35 ఏళ్ల వాడిలా మార్చేశాడు.

Viral: భార్యపై డౌట్‌తో పడక గదిలో సీక్రెట్ కెమెరాలు! చివరకు ఏమైందో తెలిస్తే.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ మెకప్ ఆర్టిస్టు ఓ పెద్దాయనను ఇంటి నుంచి తన స్టూడియోకు తీసుకొస్తాడు. బక్కపలచగా, తెల్లని గడ్డంతో ఉన్న ఆయనను చూడగానే వృద్ధుడని ఎవరైనా భావిస్తారు. అయితే, ఆ మెకప్ ఆర్టిస్టు పెద్దాయనను గుర్తుపట్టలేనంతగా మార్చేశాడు. అంచెలంచెలుగా ఆయనకు మేకప్ వేస్తూ పెద్దాయన ముఖంగా యవ్వనంతో ఉట్టిపడేలా చేశాడు. తొలుత పెద్దాయన జుట్టు యువత్ లుక్స్‌‌తో ఉట్టిపడేలా చేశాడు. ఆ తరువాత ముఖంపై రకరకాల క్రీములు వేసి వృద్ధాప్య ఛాయలు, ముడతలు కనబడకుండా చేశాడు. మేకప్ అంతా పూర్తయ్యే సరికి పెద్దాయన కుర్రోడిలా మారిపోయాడు.


ఇక వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో జనాలు షాకైపోతున్నారు. యువకులను తలదన్నేలా అంకులే యంగ్‌గా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి మేకప్ సాధ్యమేనా, ఇది అసలు నిజమైన వీడియోనేనా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లు లైఫ్‌లో తారసపడితే యువతులు బౌల్డ్ అయిపోవాల్సిందేనని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. కొందరు ఈ వీడియో చూసి రజినీ కాంత్ లుక్స్‌ను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్బంగా కొందరు మహిళల మేకప్ వీడియోలను కూడా షేర్ చేశారు. వీడియోలో పెద్దవయసు మహిళలు మేకప్ వేసుకుని గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వైనాన్ని ప్రస్తావించారు. మేకప్‌‌తో సాధ్యం కానిది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ముస్కాన్ అగ్రహారీ పేరిట ఉన్న ఎక్స్ అకౌంట్‌లో కనిపించిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. రకరకాల కామెంట్స్‌తో ఈ వీడియోను జనాలు తెగ వైరల్ చేస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Aug 27 , 2024 | 08:49 PM