Share News

Viral: ప్రేమ గుడ్డిదనేందుకు అసలైన ఉదాహరణ ఇదే! వృద్ధురాలికి భారీ షాక్!

ABN , Publish Date - Dec 19 , 2024 | 09:15 PM

మలేషిషాయకు చెందిన ఓ వృద్ధురాలు ప్రేమ పేరిట పన్నిన ఆన్‌లైన్ స్కామ్ వలలో చిక్కుకుని ఏకంగా 4 కోట్లు నష్టపోయిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ప్రేమ గుడ్డిదనేందుకు అసలైన ఉదాహరణ ఇదే! వృద్ధురాలికి భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: 60 ఏళ్లు దాటిన వయసులో ఆమె ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అలా 5 ఏళ్ల పాటు వారి ప్రేమ బంధం సాగింది. ఈ కాలంలో అతడిని ఆమె ముఖాముఖీ ఒక్కసారి కూడా కలవలేదు. కానీ, పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆమె ఎదురుగా జరుగుతున్న మోసాన్ని గుర్తించలేకపోయింది. అతడు చెప్పిన కారణానికల్లా తలూపుతో కోట్లకు కోట్లు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. మైకంలోంచి బయటపడేసరికి జరిగవల్సిన నష్టం జరిగింది. మలేషియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).

Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!

స్థానిక మీడియా కథనాల ప్రకారం, మలేషియాకు చెందిన ఓ వృద్ధురాలి ప్రేమాయణం ఆమెకు భారీ నష్టాన్నీ మిగిల్చింది. ఒంటరితనంతో కుమిలిపోతున్న ఆమెకు ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను అమెరికాలో వ్యాపారవేత్తనని అతడు పరిచయం చేసుకున్నాడు. సింగపూర్‌కు తరచూ వచ్చి వెళుతుంటానని చెప్పుకొచ్చారు. తాను మలేషియాకు మారుతున్నానని చెప్పిన అతడు కొంత డబ్బు పంపమని కోరాడు. అతడు కోరినన మొత్తాన్ని పంపించింది. అది మొదలు అతడు తరచూ కొత్త కథనాలు అల్లుతూ డబ్బులు దండుకునే వాడు. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఆమె విడతల వారీగా రూ.4.4 కోట్లు పంపించింది. మొత్తం 306 సార్లు 50బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసింది.


మరో షాకింగ్ విషయం ఏంటంటే.. తన ప్రేమికుడిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న మహిళ తన బంధువులు స్నేహితుల నుంచి అప్పులు తెచ్చి మరీ ఈ డబ్బు సమకూర్చింది. ఇంత జరుగుతున్నా కానీ ఆమె మోసపోతున్న విషయాన్ని గ్రహించలేకపోయింది. ఇలా ఏడేళ్ల సాగుతున్న ఉదంతం గురించి ఓ రోజు ఆమె తన స్నేహితులతో పంచుకుంది. దీంతో, అప్రమత్తమైన వారు వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

Viral Video: బస్సులో ప్రయాణికుడిని 26 సార్లు చెంప ఛెళ్లుమనిపించిన మహిళ!


తాను మోస పోయాన్న విషయం అప్పటికి అర్థమైన వృద్ధురాలు భారీగా షాక్ తిన్నది. డబ్బు కోసం ప్రేమ పేరిట తనను మోసం చేశారని తెలిసి ఆమె కుమిలిపోయింది. ఆన్‌లైన్‌లో మాయగాళ్లు భావోద్వేగాలనే బంధనాలుగా చేసుకుని అమాయకులను ఎలా ఆడిస్తారో తెలిసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రేమ గుడ్డిదని ఇందుకే అంటారంటూ కొందరు నిట్టూర్చారు. ఒంటరితనాన్ని ఆయుధంగా మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు వివరాలను రెండు రోజుల క్రితం బహిర్గతం చేసిన స్థానిక పోలీసులు ఆన్‌లైన్ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!

Read Latest and Viral News

Updated Date - Dec 19 , 2024 | 09:15 PM