Relationship: జీవిత భాగస్వామికి చెప్పకూడని 7 విషయాలు!
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:08 PM
జీవితభాగస్వామితో బంధం పరస్పర నమ్మకమే మూలం. అయితే, లైఫ్ పార్టనర్‌కు అన్ని సందర్భాల్లో మనసులో ఉన్నది చెప్పకూడదనేది అనుభవజ్ఞులు చెప్పేమాట.
ఇంటర్నెట్ డెస్క్: జీవితభాగస్వామితో బంధం పరస్పర నమ్మకమే మూలం. అయితే, లైఫ్ పార్టనర్‌కు అన్ని సందర్భాల్లో మనసులో ఉన్నది చెప్పకూడదనేది అనుభవజ్ఞులు చెప్పేమాట. ఇలా చెప్పకూడని విషయాలు ఏంటంటే (Viral)..
కొన్ని సందర్భాల్లో జీవతభాగస్వామి కంటే మరో వ్యక్తి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. ఆ విషయాన్ని అపరాధ భావంతోనే మరేదో కారణంతోనే జీవితభాగస్వామికి చెబితే వారిలో అభద్రతా భావం, ఈర్ష్య జనించి బంధానికి బీటలువారే అవకాశం ఉంది.
Viral: గ్రీన్ కార్డుపై ఎన్నారై సీఈఓ కీలక ప్రశ్న! ఒక్క పదంతో మస్క్ రిప్లై!
లైఫ్ పార్టనర్‌ను మాజీలతో పోల్చడం కూడా మంచిది. దీంతో, అవతలి వారిలో అభద్రతా భావం, ఆత్మన్యూనత వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఒక్కోసారి బంధాలను శాశ్వతంగా తెంచేస్తుంది.
జీవిత భాగస్వామిలో ఏదైనా అంశాన్ని మార్చలేమని భావించినప్పుడు దాని గురించి మర్చిపోవడమే మంచిది. అందుకు బదులు భార్య, లేదా భర్తలో బలలాను గుర్తించి ప్రోత్సహించాలి. మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అలా కాకుండా నిత్యం విమర్శలకు దిగితే భార్యాభర్తల మధ్య ఎడం పెరిగే అవకాశం ఉందది.
Gujarat: కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక వేళ్లు నరికేసుకున్న వ్యక్తి!
ఒక్కోసారి కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ జీవిత భాగస్వామిపై చేసే వ్యతిరేక వ్యాఖ్యలను కూడా మనసులో దాచుకోవడమే మంచిది. ఈ విషయాలను పంచుకుంటే అనవసర వివాదాలు రాజేసినట్టు అవుతుంది.
జీవితభాగస్వామిక శరీరాకృతి, రూపురేఖలు గురించి కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా లోపం వారిలో కనిపించినా మిన్నకుండిపోవడం మంచిది. ఇది వారి ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టే అవకాశం ఉంది.
జీవితభాగస్వామి కలలు, ఆశయాలు లేదా సామర్థ్యాలపై కూడా సంశయాలు వెలిబుచ్చకూడదు. తమకు మద్దతు లభించట్లేదని వారు భావించే అవకాశం ఉంది. మీ సందేహాలు నిజమే అయినా వీలైనంతగా సానుకూల ధోరణితో స్పందించాలి.
ప్రతి వ్యక్తిలోనూ మనకు నచ్చని అంశం ఏదోకటి ఉంటుంది. ఉదాహరణకు జీవిత భాగస్వామి తరపు వారి నేపథ్యం లేదా వారి అలవాట్లు నచ్చకపోవచ్చు. ఈ విషయాల్ని పదే పదే లేవనెత్తితే కూడా గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి, భార్యాభర్తల బంధం పదికాలల పాటు నిలిచుండాలంటే ఇలాంటి సున్నితమైన విషయాల్లో జాగ్రత్త పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..
Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..