Share News

Viral Video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడా.. ఈ కుర్రాడి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్ల రియాక్షన్స్ వింటే..

ABN , Publish Date - Dec 03 , 2024 | 08:45 AM

కొందరు కుర్రాళ్లు బిజీ రోడ్డు మీద ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral Video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడా.. ఈ కుర్రాడి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్ల రియాక్షన్స్ వింటే..
Bike stunt

ప్రాణాలతో చెలగాటం ఆడడం చాలా మందికి సరదా. తమ ప్రాణాల కంటే సోషల్ మీడియా వ్యూస్‌కే చాలా మంది ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రాణాంతక సాహసాలకు (Adventures) కూడా వెనుకాడరు. బిజీ రోడ్డు మీద ప్రమాదకర బైక్ స్టంట్లు (Bike stunts) చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో కుర్రాడు అత్యంత ప్రమాదకరంగా బైక్ నడుపుతూ చూసే వారికి ఆందోళన కలిగిస్తున్నాడు (Viral Video).


@Cute_girl అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డుపై అతి వేగంతో బైక్ నడుపుతూ.. దానితో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నాడు. వేగంగా బైక్ నడుపుతూ, ఒక్కోసారి ఫ్రంట్ వీల్‌ని గాలిలో లేపి, కొన్నిసార్లు బైక్‌ని ఊపుతూ నడుపుతున్నాడు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు బైక్‌తో సహా గాల్లోకి లేస్తున్నాడు. కార్లను, ఇతర వాహనాలను విపరీతమైన వేగంతో ఓవర్ టేక్ చేస్తున్నాడు. చివర్లో బైక్ ముందు చక్రాన్ని పూర్తిగా గాల్లోకి లేపి రోడ్డుపై కూడా చేతులు పెట్టాడు. అతడి రైడింగ్‌ను అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``యమ్‌రాజ్ సెలవులో ఉన్నారా``, ``సూపర్ ట్యాలెంట్.. కానీ ప్రమాదకరం``, ``మీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతారు``, ``అతడికి భయమే లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..


Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..


Viral Video: ఉక్కు శరీరం అంటే ఇదేనేమో.. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ ఎలా వంగిపోయిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 03 , 2024 | 10:49 AM