Share News

Viral Video: చలిలో తండ్రి సాహసం.. కుమారుడిపై చేయి వేసి డ్రైవింగ్

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:07 PM

చలి చంపుతోంది. పాకిస్థాన్‌లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. బండి మీద చిన్న పిల్లలు ఉంటే ఆ పాట్లు మాములుగా ఉండవు. టూ వీలర్ మీద ఓ తండ్రి వెళ్తున్నాడు. అతని వెనకాల కుమారుడు ఉన్నాడు. చలిలో పొగమంచు వస్తోండగా వారి ప్రయాణం సాగింది.

 Viral Video: చలిలో తండ్రి సాహసం.. కుమారుడిపై చేయి వేసి డ్రైవింగ్

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: చలి (Cold) చంపుతోంది. అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర భారతదేశం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాయాది పాకిస్థాన్‌లో (Pakistan) కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. చలిలో అది కూడా బైక్ మీద వెళ్లడం అంటే మాములు మాటలు కాదు.. ఇక బండి మీద చిన్న పిల్లలు ఉంటే ఆ పాట్లు మాములుగా ఉండవు. టూ వీలర్ మీద ఓ తండ్రి (Father) వెళ్తున్నాడు. అతని వెనకాల కుమారుడు ఉన్నాడు. చలిలో (Cold) పొగమంచు వస్తోండగా వారి ప్రయాణం సాగింది. పొగమంచు వస్తోండగా.. ఒక చేతితో కుమారుడిని పట్టుకొని మరి డ్రైవ్ చేస్తున్నాడు. పాకిస్థాన్‌ (Pakistan) పంజాబ్‌లో ఘటన జరిగింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

వీడియో చూసిన వారు రెండుగా విడిపోయారు. ఒకరెమో తండ్రి ప్రేమ అంటే ఇది అనగా.. మరొకరు ఇలా చేయడం సరికాదని సూచిస్తున్నారు. చలిలో, ఒక చేతితో డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి కారణం అవుతుందని చెబుతున్నారు. ‘తల్లి ప్రేమ కన్నా తండ్రి తక్కువ కాదు. దానిని పైకి వ్యక్తపరచరు. ప్రేమ చూపడంలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ ఇద్దరు ఒకేలా పిల్లలను చూస్తారని’ కామెంట్స్ చేశారు. అలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మరొకరు రాశారు. చలిలో, మంచు కురిసే సమయంలో ఒక చేతితో బైక్ నడపడం అంతా మంచిది కాదని సూచించారు. అలా అయితే బైక్ (Byke) మీద కాక కారులో వెళ్లాలని ఇంకొకరు సూచించారు.

Updated Date - Jan 06 , 2024 | 01:10 PM