Share News

Viral News: 14 ఏళ్ల బాలిక.. బాహుబలిలా మారి..

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:08 PM

మంగళూరులో గల కిన్నిగోలిలో ఓ విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లింది. రాత్రి ఇంటికెళ్లే సమయంలో విద్యార్థిని తీసుకెళ్లేందుకు తల్లి, లేదంటే తండ్రి వస్తుంటారు. ఆ రోజు తల్లి వచ్చింది. ఆ రోడ్డు చిన్నదే.. రాత్రి 7 గంటల సమయంలో కాస్త రద్దీగా ఉంది. ధైర్యం చేసి రోడ్డుకు ఇటు వైపున ఉన్న కూతురి వద్దకు వచ్చేందుకు తొందరపడింది.

Viral News: 14 ఏళ్ల బాలిక.. బాహుబలిలా మారి..
A Girl Lifts Auto Rickshaw

మంగళూర్: రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతుంటాయి. వెంటనే స్పందిస్తే స్వల్ప గాయాలతో బయట పడతారు. లేదంటే తీవ్రంగా గాయ పడాల్సి వస్తోంది. కర్ణాటకలో (Karnataka) ఓ విద్యార్థిని తన తల్లి ప్రాణాలు కాపాడింది. ప్రమాదం జరిగిన వెంటనే వాయువేగంతో స్పందించింది. ఆమెకు ఇతరులు తోడవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


ఏం జరిగిందంటే..?

మంగళూరులో గల కిన్నిగోలిలో ఓ విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లింది. రాత్రి ఇంటికెళ్లే సమయంలో విద్యార్థిని తీసుకెళ్లేందుకు తల్లి, లేదంటే తండ్రి వస్తుంటారు. ఆ రోజు తల్లి వచ్చింది. ఆ రోడ్డు చిన్నదే.. రాత్రి 7 గంటల సమయంలో కాస్త రద్దీగా ఉంది. ధైర్యం చేసి రోడ్డుకు ఇటు వైపున ఉన్న కూతురి వద్దకు వచ్చేందుకు తొందరపడింది. ఇంతలో ఆటో యమ స్పీడ్‌గా వచ్చింది. ఆటో రావడం, ఢీ కొనడం క్షణాల్లో జరిగిపోయాయి. ప్రమాదం ఎలా జరిగింది ఆ విద్యార్థిని కూడా అదేవిధంగా స్పందించింది.


a-girl.jpg


ఆటోను లేపి..

తల్లిని చూసి చిన్నారి తల్లడిల్లి పోయింది. వెంటనే ఆటో వద్దకొచ్చింది. ఆటో కింద ఉన్న తల్లికి గాయాలు కాకుండా ఉండేందుకు ఆటోను లేపింది. ఆటో బలంగా ఉన్న ధైర్యం చేసింది. ఆటోలో ఉన్న ఒకరు, అక్కడ ఉన్న ఇంకొందరు విద్యార్థినికి సాయం చేశారు. క్షణాల్లో ఆటోను లేపారు. తల్లిని పిలిచింది.. కొన్ని నిమిషాల తర్వాత లేవడంతో చిన్నారి ఊపిరి పీల్చుకుంది. ఆటో పడిపోయిన సమయంలో అందులో ప్రయాణికులు కూడా ఉన్నారు. అలా తల్లితోపాటు, ఇతరులను కూడా సేవ్ చేసింది. నెటిజన్ల చేత శభాష్ అని ప్రశంసలు అందించుకుంటుంది.


a-gril-2.jpg


వావ్.. విద్యార్థిని

ఆ చిన్నారి వయస్సు 14 సంవత్సరాలే.. స్కూల్‌కు వెళుతున్న విద్యార్థిని ఆటోను లేపింది. ఆమెకు మరికొందరు సాయం చేయడంతో ఆటోను సునాయసంగా లేచింది. ఆమె చూపిన తెగువ, ధైర్యం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని టీచర్లు, స్థానికులు అంటున్నారు. అక్కడున్న వారంతా స్టూడెంట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇది కూడా చదవండి:

Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి

Viral: నిద్రపోతున్న వ్యక్తి ముక్కులోకి దూరిన బొద్దింక.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తలు చదవండి:

Updated Date - Sep 09 , 2024 | 05:08 PM