Telangana Police: డయల్ 100కు పెరిగిన కాల్స్ తాకిడి.. ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ ఫోన్ చేసిన వ్యక్తి!
ABN , Publish Date - May 28 , 2024 | 01:01 PM
ప్రజలకు ఏదైనా ప్రమాదకర సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు డయల్ చేయడం కోసం 100 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌కు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 100కు ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళుతున్నారు.
ప్రజలకు ఏదైనా ప్రమాదకర సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు (Police) డయల్ చేయడం కోసం 100 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌కు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 100కు ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు (Telangana Police) స్పాట్‌కు వెళుతున్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని న్యాయం అందిస్తున్నారు. పోలీసుల నుంచి తక్షణ స్పందన లభిస్తుండడంతో ప్రజల నుంచి 100కు తాకిడి పెరిగింది.
ఇదే అదునుగా తీసుకుని కొందరు ఆకతాయిలు, పోకిరీలు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లు మాత్రమే కాదు.. సాధారణ కుటుంబీకులు కూడా ప్రతి చిన్న విషయానికీ 100కు ఫోన్ చేసి చికాకు పెడుతున్నారు. మా పిల్లి తప్పి పోయింది వెతికి పెట్టండి. మా గోడ మీద బల్లి ఉంది తరిమి పెట్టండి ఇలాంటి కాల్స్ చేస్తూ పోలీసులను విసిగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తమ 100కు ఫోన్ చేసి పోలీసులను పిలిపించాడు. తీరా చూస్తే అతని సమస్య.. ఓ కుక్క అతని ఇంట్లోకి దూరడమే.
తన ఇంట్లోకి దూరిన కుక్కను తరిమేయడం కోసం అతడు 100కి డయల్ చేసి పోలీసులను పిలిపించాడు. వాళ్లింటికి వెళ్లిన పోలీస్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో విలువైన పోలీసుల సమయాన్ని ఇలా దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..