Viral Video: స్కామ్ చేద్దామనుకుంటే దిమ్మ దిరిగే షాక్.. మొబైల్‌కు ఎదురుగా కుక్కను తీసుకొచ్చి..
ABN , Publish Date - Dec 28 , 2024 | 07:21 PM
ఇటీవలి కాలంలో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు కాజేసే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రభుత్వం కూడా ఈ రకమైన నేరాల గురించి పలు మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఈ రకమైన ఛీటింగ్‌కు పాల్పడేవాళ్లు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా గెటప్‌లు వేసుకుని వీడియో కాల్స్ చేసి భయపెడుతుంటారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సౌకర్యాలు ఎన్ని పెరిగాయో, నేరాల సంఖ్య (Cyber Crimes) కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుని సులభంగా డబ్బు కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో వీడియో కాల్స్ (Video Calls) చేసి భయపెట్టి డబ్బులు కాజేసే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ రకమైన నేరాల గురించి పలు మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఈ రకమైన ఛీటింగ్‌కు పాల్పడేవాళ్లు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా గెటప్‌లు వేసుకుని వీడియో కాల్స్ చేసి భయపెడుతుంటారు. (Viral Video)
తాజాగా ఓ వ్యక్తికి అలాంటి కాల్ వచ్చింది. అయితే అతడు తెలివిగా వ్యవహరించి షాకిచ్చాడు. shinny_martina అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తికి వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే ముంబై పోలీస్ అధికారి (Mumbai Police Officer) వేషంలో ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతడు తనను తాను అంధేరీ పోలీస్ అధికారిగా చెప్పుకున్నాడు. బెదిరింపులకు దిగుతూ మొహం చూపించాలని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి తన అందమైన కుక్క పిల్లను మొబైల్ స్క్రీన్ ముందు పెట్టి.. ``నేను వచ్చాను సర్`` అని చెప్పాడు. ఈ సమాధానం విని ఆ మోసగాడు ఆశ్చర్యపోయాడు.
``నన్ను చూడండి, నకిలీ యూనిఫాం`` అంటూ కవ్వించాడు. తన పన్నాగం ఫలించలేదని గ్రహించిన మోసగాడు ఫోన్ డిస్‌కనెక్ట్ చేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన మొత్తాన్ని రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. తగ్గిన బుద్ధి చెప్పారంటూ చాలా మంది అతడిని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: విమానం అద్దెకు తీసుకుని డబ్బుల వర్షం కురిపించాడు.. కాబోయే కోడలికి ఊహకందని గిఫ్ట్..
Shocking: ఇదెక్కడి విచిత్రం.. పక్షి కడపులో నుంచి బయటపడుతున్న చేప.. అసలేం జరిగిందంటే..
Viral News: బెడ్‌షీట్‌పై కాఫీ చుక్కలు.. కస్టమర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన హోటల్ సిబ్బంది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి