Share News

Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా.. ఇంతకంటే డేంజరస్ ప్రాంక్ వీడియో ఉంటుందా!

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:31 PM

రైలు వేగంగా దూసుకొస్తుంటే దాని ముందు పట్టాలపై సైకిల్ విసిరేసిన ప్రాంక్ వీడియో జనాలను తెగ భయపడెతోంది. ఇలాంటి ప్రాంక్స్‌కు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని జనాలు డిమాంమడ్ చేస్తున్నారు.

Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా.. ఇంతకంటే డేంజరస్ ప్రాంక్ వీడియో ఉంటుందా!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న యావలో పడి జనాలు నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాము ఇబ్బందుల్లో పడుతూనే ఇతరులనూ ప్రమాదాల్లో పడేస్తున్నారు. ప్రతి రోజూ ఇలాంటి ఘటన అనేకం వెలుగు చూస్తున్నా కంటెంట్ క్రియేటర్లలో మాత్రం మార్పు రావట్లేదు. అంతకంతకూ రెచ్చిపోతూ కొత్త కొత్త ప్రమాదాలు సృష్టిస్తున్నారు. తాజాగా వీడియోలో (Viral) సరిగ్గా ఇదే జరిగింది.

ఈ వీడియోలో ఒకరు ఏకంగా దూసుకొస్తున్న రైలుతో ప్రాంక్ వీడియో చేసే ప్రయత్నం చేశారు. ఓవైపు రైలు దూసుకొస్తుంటే పట్టాలపై ఏకంగా సైకిల్‌ను తోసేశాడు. దీంతో, రైలు సైకిల్ పై నుంచి దూసుకెళ్లిపోయింది. అది నుజ్జునుజ్జు అయిపోయింది. ఆ వెంటనే రైలు కింద ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డటంతో రైలు ఆగిపోయింది (A man threw a bicycle on the railway track to prank then this happened).

Viral: ఇంత జరిగినా గొరిల్లా మనల్ని నమ్ముతోంది! మనుషుల్లో మార్పెప్పుడొస్తుందో!


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు ఈ ప్రాంక్ వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్‌పై మండిపడుతున్నారు. ఇది ప్రాంక్ వీడియో కాదని, ప్రాణాలతో చెలగాటమని వ్యాఖ్యానించారు. జనాలు ఇలా తయ్యారయ్యారేంటని ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలతో రైళ్లు పట్టాలు తప్పితే వందల మంది ప్రాణాలు కోల్పోతారని భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ అధికంగా ఉండే స్టేషన్లలో ఇలాంటి ప్రాంక్ వీడియో ఎలా చేసుంటారో అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. జనాలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 04:31 PM