Viral News: అమృత్ సర్ స్పెషల్ టీ..
ABN , Publish Date - Sep 09 , 2024 | 08:53 PM
ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు టీ తీసుకుంటూనే ఉంటారు. ఛాయ్‌లలో చాలా రకాలు ఉంటాయి. అల్లం ఛాయ్, ఇరానీ ఛాయ్, మలాయ్ ఛాయ్ అలా.. ఒక్కో వైరెటీకి ఒక్కో ధర ఉంటుంది. ఎంత కాస్ట్లీ అయినా రూ.20 నుంచి రూ.30 వరకు ఉంటుంది. ఏరియాను బట్టి ధర నిర్ణయిస్తారు.
ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు టీ తీసుకుంటూనే ఉంటారు. ఛాయ్‌లలో చాలా రకాలు ఉంటాయి. అల్లం ఛాయ్, ఇరానీ ఛాయ్, మలాయ్ ఛాయ్ అలా.. ఒక్కో వైరెటీకి ఒక్కో ధర ఉంటుంది. ఎంత కాస్ట్లీ అయినా రూ.20 నుంచి రూ.30 వరకు ఉంటుంది. ఏరియాను బట్టి ధర నిర్ణయిస్తారు. రెగ్యురల్ టీ రూ.8 నుంచి రూ.10 వరకు ఉంటుంది. అమృత్ సర్‌లో (Amritsar tea) మాత్రం ఒక్క ఛాయ్ ధర అక్షరాలా రూ.100.
ఛాయ్ ధర..
అవును.. మీరు చదివింది నిజమే. అమృత్ సర్ రోడ్డు మీద పెద్దాయన చేసే స్పెషల్ టీ ధర రూ. వంద. ఇందులో ఏం స్పెషల్ ఉంది అనే కదా మీ సందేహాం. అందులో చక్కెర, టీ పౌడర్ వేయరు. బాదం రుబ్బి పొడి వేస్తారు. గులాబీ రెక్కలు ఉంటాయి. ఆ రెండింటి కన్నా వెన్నను కరిగించి వేస్తారు. వేడి వేడి పాలను వెన్న, బాదం పప్పు కలిపిన మిశ్రమంలో పోసి.. స్పెషల్ టీ రెడీ అని కస్టమర్‌కు అందజేస్తారు. టీలో వేసే ఐటెమ్స్ ధర ఎక్కువ.. దాంతో ధర కూడా అదిరిందని కస్టమర్స్ అభిప్రాయ పడుతున్నారు.
గ్లాస్ వంద మాత్రమే
అమృత్ సర్ స్పెషల్ టీని ఫుడ్ ఎక్స్‌పరిమెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు అమృత్ సర్‌లో ఖరీదైన ఛాయ్.. గ్లాస్ రూ.వంద అని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకేముంది ఆ వీడియో తెగ ట్రోల్ అవుతోంది. రెండురోజుల క్రితం వీడియో పోస్ట్ చేయగా ఇప్పటికే 10 వేల లైకులు వచ్చాయి. కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
ఛాయ్ కాదు.. బాదమ్ షేక్
ఆ టీని ఛాయ్ అని ఎందుకు పిలుస్తారు. బాదం షేక్ అని పిలవొచ్చు కదా అని ఓ యూజర్ రాసుకొచ్చారు. అందులో మటన్ మసాలా, పెరుగు వేయడం మరచిపోయినట్టున్నారు అని ఇంకొకరు సెటైర్లు వేశారు. అందులో బాదం, గులాబీ రేకులు, ఇలాచీ వేయడం బాగుంది. వెన్న కలుపడం బాగోలేదు. అలా చేస్తే దానిని టీ అనరు కాఫీ అంటారని మరొకరు అభిప్రాయ పడ్డారు. అది టీ కాదు.. బాదమ్ షేక్ అని మరొకరు రాసుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని షేర్ చేశారు.
ఇది కూడా చదవండి:
Viral News: పులికి ముద్దులు.. తిరిగి పులి ఏం చేసిందంటే
Viral News: 14 ఏళ్ల బాలిక.. బాహుబలిలా మారి..
Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి