Share News

Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:08 PM

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆకర్షణీయంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. బైక్ ఎక్కిన స్నేహితుడికి ఓ వ్యక్తి మర్చిపోలేని షాకిచ్చాడు. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు.

Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Bike stunt gone wrong

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆకర్షణీయంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి (Funny Videos). ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. బైక్ (Bike stunt) ఎక్కిన స్నేహితుడికి ఓ వ్యక్తి మర్చిపోలేని షాకిచ్చాడు. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు. @Kohled_Eyes అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి షాప్ ముందు పార్క్ చేసిన బైక్‌ను తీసి స్టార్ట్ చేశాడు. అతడి స్నేహితుడు వెనుక సీట్లో కూర్చున్నాడు. ఆ వ్యక్తి తన బైక్‌ను తిప్పి రోడ్డుపై స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బైక్‌ ముందు చక్రం గాల్లోకి ఎత్తగానే బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో ఆ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కిందప డిపోయాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా నవ్వుతూ ఉండిపోయాడు. ఆ వీడియో షాప్‌ ముందు అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``వావ్, వాట్ ఎ బ్లాస్ట్``, ``అకస్మాత్తుగా పొరపాటు జరిగింది``, ``సమస్య లేదు, కొన్నిసార్లు ఇది జరుగుతుంది``, ``ఫన్నీ మూమెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..


Viral: ఇదో శుభలగ్నం కేసు.. ప్రియుడి భార్యపై కోర్టుకెక్కిన మహిళ.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..


Optical Illusion Test: మీవి నిజంగా డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో గ్లౌస్, చేప ఎక్కడున్నాయో కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2024 | 07:08 PM