Share News

Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 20 , 2024 | 06:02 PM

ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్‌లను అందిస్తున్నాయి. అయితే వాటి ద్వారా ప్రయాణం చేస్తున్నవారు ఒక్కోసారి చేస్తున్న ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రోహిత్ అరోరా అనే వినియోగదారుడు ఉబర్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే రైడ్ కోసం వచ్చిన కారును చూసి షాకయ్యాడు.

Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..
Uber Cab Condition

ప్రస్తుతం మహా నగరాలే కాదు.. ఓ మోస్తరు పట్టణాల్లో కూడా ఎక్కడికి వెళ్లాలన్నా చాలా మంది క్యాబ్‌ (Cab)లను ఆశ్రయిస్తున్నారు. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్‌లను అందిస్తున్నాయి. అయితే వాటి ద్వారా ప్రయాణం చేస్తున్నవారు ఒక్కోసారి చేస్తున్న ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రోహిత్ అరోరా అనే వినియోగదారుడు ఉబర్ ద్వారా క్యాబ్ (Uber Cab) బుక్ చేసుకున్నాడు. అయితే రైడ్ కోసం వచ్చిన కారును చూసి షాకయ్యాడు. వెంటనే సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై ఉబర్ సంస్థ స్పందించింది (Viral News).


రోహిత్ అరోరా తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్ (ట్విటర్) ద్వారా పంచుకున్నాడు. అరోరా తన పోస్ట్‌లో ఉబర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ, ``ఉబర్‌ భారతదేశంలో ఎటువంటి ప్రమాణాలనూ పాటించడం లేదు. కారు జంక్ యార్డ్ నుండి వచ్చినట్లు కనిపిస్తోంది`` అంటూ కామెంట్ చేసి రెండు ఫొటోలను జత చేశారు. మరో పోస్ట్‌లో, ``నేను అద్భుతమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన మెర్సిడెస్‌ బెంజ్‌ని అడగలేదు. కనీసం పరిశుభ్రత కోరుకోవచ్చు కదా. దీనికి డబ్బు అవసరం లేదు, చిన్న ప్రయత్నం చాలు`` అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఉబర్ ఇండియా స్పందించింది.


అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సదరు రైడ్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వినియోగదారుల పట్ల భారత్‌లో ఇలాగే ప్రవర్తిస్తారు``, ``వారి రేటింగ్‌ పడిపోయినప్పుడే వారు మెరుగవడానికి ప్రయత్నిస్తారు``, ``మనదేశంలో రేటింగ్ సిస్టమ్‌కు పెద్ద విలువ లేదు``, ``నాకు కూడా గతంలో ఇలాంటి అనుభవం ఎదురైంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఇదో శుభలగ్నం కేసు.. ప్రియుడి భార్యపై కోర్టుకెక్కిన మహిళ.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..


Optical Illusion Test: మీవి నిజంగా డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో గ్లౌస్, చేప ఎక్కడున్నాయో కనుక్కోండి..


Viral Video: హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న కోతికి షాకింగ్ అనుభవం.. హఠాత్తుగా మొసలి నోటికి చిక్కి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2024 | 06:02 PM