Share News

Viral Video: ఇదేం స్పీడ్ అన్నా.. మూడు సెకెన్లలోనే జెడ్ టూ ఏ.. హైదారాబాదీ సత్తాకు గిన్నీస్ రికార్డు దాసోహం!

ABN , Publish Date - May 04 , 2024 | 02:13 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెరపు వేగంతో ఇంగ్లీష్‌ ఆల్ఫాబెట్స్‌ను రివర్స్‌ ఆర్డర్‌లో టైప్ చేశాడు. కేవలం 2.88 సెకన్లలో Z నుంచి A వరకు టైప్ చేశాడు. అతడి వేగం చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే.

Viral Video: ఇదేం స్పీడ్ అన్నా.. మూడు సెకెన్లలోనే జెడ్ టూ ఏ.. హైదారాబాదీ సత్తాకు గిన్నీస్ రికార్డు దాసోహం!
Hyderabdi fastest typing

హైదరాబాద్‌కు (Hyderebad) చెందిన ఓ వ్యక్తి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెరపు వేగంతో ఇంగ్లీష్‌ ఆల్ఫాబెట్స్‌ను రివర్స్‌ ఆర్డర్‌లో టైప్ (Fastest Typing) చేశాడు. కేవలం 2.88 సెకన్లలో Z నుంచి A వరకు టైప్ చేశాడు. అతడి వేగం చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన షేక్ అష్రాఫ్‌ Z నుంచి A వరకు 26 ఆంగ్ల పదాలను సూపర్ స్పీడ్‌లో టైప్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


guinnessworldrecords ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ``రివర్స్ ఆల్ఫాబెట్స్‌ను అతి తక్కువ సమయంలో టైప్ చేశాడు. ఎస్‌కే ఆష్రాఫ్ కేవలం 2.88 సెకెన్లలో ఈ పని పూర్తి చేశాడు`` అని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఈ ప్రపంచ రికార్డును సెట్ చేయడానికి సాధారణ క్వెర్టీ కీబోర్డ్‌నే ఉపయోగించాడు. రెప్ప పాటు వేగంతో అతడు టైప్ చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 56 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కంగ్రాట్స్ ఆష్రాఫ్``, ``బ్రదర్ చాలా రోజులుగా టైప్ రైటర్ జాబ్ చేస్తున్నట్టున్నాడు``, ``మెరపు వేగం అంటే ఇదేనేమో``, ``ఇది గొప్ప రికార్డు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు టెస్ట్.. పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థి ఎవరో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదే.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వైరల్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 02:13 PM