Share News

Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదే.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వైరల్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

ABN , Publish Date - May 03 , 2024 | 04:18 PM

మండుతున్న ఎండలతో అందరూ ఇబ్బందిపడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రత జనాలను బెండేలెత్తిస్తోంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మనుషుల సంగతి పక్కన పెడితే ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఎంతో ఇబ్బందిపడుతున్నాయి.

Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదే.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వైరల్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
ACs for the Buffaloes

మండుతున్న ఎండలతో (Summer) అందరూ ఇబ్బందిపడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రత జనాలను (Heat Wave) బెండేలెత్తిస్తోంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను, (AC) కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మనుషుల సంగతి పక్కన పెడితే ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఎంతో ఇబ్బందిపడుతున్నాయి. అందుకే ఓ వ్యక్తి పెద్ద మనసు చేసుకుని తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్ ఏర్పాటు చేశాడు (Viral Video).


manjeetmalik567 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి గెదెల కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ సిద్ధం చేశాడు. మొత్తం క్లోజ్ చేసి ఉన్న రూమ్‌లో ముర్రా జాతి గేదెలను ఉంచాడు. ఆ గదిలో రెండు ఏసీలను ఏర్పాటు చేశాడు (ACs for the Buffaloes). ఫ్యాన్లు, లైట్ కూడా అమర్చాడు. పెరుగుతున్న ఎండలు గేదెలను ఇబ్బంది పెట్టకుండా సకల ఏర్పాట్లు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 30 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రదర్.. అవి జంతువులు. వాటిని ఆరు బయట ఉంచండి``, ``ఏసీల వల్ల వాటి ఆరోగ్యం పాడవుతుంది``, ``ముర్రా జాతి గేదెల వేడిని తట్టుకోలేవు``, ``ఇవి అంబానీ గేదెలు``, ``ఆ వ్యక్తి చాలా ధనవంతుడిలా ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఫ్రిడ్జ్, కూలర్‌తో వెరైటీ ఏసీ తయారు చేసిన వ్యక్తి.. నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..!


Viral: కూతురి బెడ్రూమ్ నుంచి వింత శబ్దాలు.. తల్లిదండ్రులు చెక్ చేస్తే బయటపడిన షాకింగ్ విషయం..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2024 | 04:40 PM