Share News

Viral News: బీర్ టేస్ట్ చేసిన పాము.. చివరకు ఏమైందంటే..!

ABN , Publish Date - Aug 16 , 2024 | 10:51 AM

Snake Viral News: మనకు దాహమేస్తే ఓ గ్లాస్‌లో వాటర్ తీసుకుని తాగుతాం. లేదంటే ఓ బాటిల్‌తో అయినా తాగుతాం. మరి జంతువులు, క్షీరదాలకు, పక్షులకు దాహం వేస్తే? ఇంకేముంది.. నీరు ఎక్కడ లభిస్తే అక్కడ తాగి తమ దాహం తీర్చుకుంటాయి. మరి ఇక్కడ ఓ పాముకు కూడా దాహమేసిందో ఏమోగానీ..

Viral News: బీర్ టేస్ట్ చేసిన పాము.. చివరకు ఏమైందంటే..!
Snake Viral News

Snake Viral News: మనకు దాహమేస్తే ఓ గ్లాస్‌లో వాటర్ తీసుకుని తాగుతాం. లేదంటే ఓ బాటిల్‌తో అయినా తాగుతాం. మరి జంతువులు, క్షీరదాలకు, పక్షులకు దాహం వేస్తే? ఇంకేముంది.. నీరు ఎక్కడ లభిస్తే అక్కడ తాగి తమ దాహం తీర్చుకుంటాయి. మరి ఇక్కడ ఓ పాముకు కూడా దాహమేసిందో ఏమోగానీ.. బీర్ టిన్‌ బాటిల్‌లో తలపెట్టింది. అప్పుడే అసలు కథ మొదలైంది. ఏదో చేద్దామని వెళితే.. మరేదో అవడంతో ఆ పాము బిత్తరపోయింది. తెలియక చేసిన పొరపాటుకు చాలా సమయంపాటు అవస్థలు పడింది. చివరకు దాని టైమ్ బాగుండి.. ఆ సమస్య నుంచి బయటపడి జర జర జారుకుంది. ఇంతకీ ఆ పాము ఏం చేసింది? పాముకు ఏమైంది? ప్రత్యేక కథనం మీకోసం..


కొందరు వ్యక్తులు అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు రోడ్డుపై కనిపించే కోతులు, జంతువుల కోసం పండ్లు, ఇతర ఆహార పదార్థాలు పడేస్తారు. నీళ్ల బాటిళ్లను కూడా వదిలేస్తుంటారు. వీటి ద్వారా ఆయా జంతువులు తమ ఆకలిని, దాహార్తిని తీర్చుకుంటాయి. అయితే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఓ పాముకు దాహమైందో ఏమో గానీ.. రైతు వేదిక ఎదురుగా ఉన్న మైదానంలో మందుబాబులు తాగి పడేసిన బీర్ టిన్‌లో తల దూర్చింది. మళ్లీ ఆ తలను బయటకు తీసేందుకు పాము ప్రయత్నించగా.. అస్సలు రాలేదు.


పాము తల బీర్ టిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆ పాము గిల గిల కొట్టుకుంది. సుమారు మూడు గంటలపాటు అటూ ఇటూ తిరుగుతూ ఆగమాగం అయ్యింది. బీర్ టిన్‌లో తల ఇరుక్కున్న పామును గమనించిన స్థానికులు.. దానిని సేవ్ చేసేందుక ప్రయత్నించారు. బీర్ టిన్‌ నుంచి పాము తలను తీసేందుకు ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు. చివరకు పాము ముళ్ల కంచెలోకి వెళ్లింది. ఆ క్రమంలో ముళ్ల కంప అడ్డుపడి బీర్ టిన్‌లోంచి పాము తల బయటకు వచ్చింది. దెబ్బకు ఊపిరి పీల్చుకున్న పాము.. హమ్మయ్య అనుకుని సెకన్ల వ్యవధిలో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

For More Viral News and Telugu News..

Updated Date - Aug 16 , 2024 | 10:51 AM