Share News

Viral Video: సింహంతో ఆటలాడకూడదు బ్రదర్.. సింహం తలపై నిమరడానికి ప్రయత్నిస్తే ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:03 PM

క్రూర మృగాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం చాలా మంది అడవి జంతువులను నేరుగా చూసేందుకు సఫారీ టూర్లకు వెళుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అటవీ పర్యటనలకు వెళుతున్నప్పటికీ కొందరు ఫొటోలు, వీడియోలు, రీల్స్ కోసం ప్రమాదాలకు చేరువగా వెళుతున్నారు.

Viral Video: సింహంతో ఆటలాడకూడదు బ్రదర్.. సింహం తలపై నిమరడానికి ప్రయత్నిస్తే ఏం జరిగిందో చూడండి..
Lion

క్రూర మృగాలకు (Wild Animals) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం చాలా మంది అడవి జంతువులను నేరుగా చూసేందుకు సఫారీ టూర్లకు (Safari Tour) వెళుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అటవీ పర్యటనలకు వెళుతున్నప్పటికీ కొందరు ఫొటోలు, వీడియోలు, రీల్స్ కోసం ప్రమాదాలకు చేరువగా వెళుతున్నారు. వన్య ప్రాణులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, తాము కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో వ్యక్తి ప్రవర్తన సింహానికి (Lion) ఆగ్రహం తెప్పించింది (Viral Video).


wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టీమ్ జీప్‌లో సఫారీ పర్యటనకు వెళ్లింది. ఒక దగ్గర జీప్‌ను ఆపి ఉంచగా దాని పక్కనే ఓ సింహం కూర్చుని ఉంది. ఆ సమయంలో జీప్‌లోని వ్యక్తి సింహం తలపై నిమిరేందుకు ప్రయత్నించాడు. సింహం తలపై భయంభయంగానే చెయ్యి వేశాడు. స్పర్శ తగలగానే సింహం వేగంగా, చాలా కోపంగా తల పైకెత్తి చూసింది. అయితే అప్పటికే ఆ వ్యక్తి భయంతో లోపలికి వెళ్లిపోవడంతో సింహం శాంతించింది.


ఈ వీడియోను కెన్యాలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక రోజు క్రితం షేర్ అయిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా ప్రమాదకరమైన ప్రవర్తన``, ``ప్రమాదాన్ని స్వయంగా ఆహ్వానించడం అంటే ఇదే``, ``సఫారీ టూర్లను రద్దు చేయాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వధూవరుల డ్యాన్స్ చూస్తే ముచ్చటేయడం ఖాయం.. సిగ్గుపడుతూనే ఎలా చిందులేశారో చూడండి..


Puzzle: మీ కళ్లకు, బ్రెయిన్‌‌కు నిజమైన టెస్ట్.. ఈ ఫొటోలోని FLOW పదం ఎక్కడుందో వెతకండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 03 , 2024 | 05:03 PM