Viral Video: ఈ వధూవరుల డ్యాన్స్ చూస్తే ముచ్చటేయడం ఖాయం.. సిగ్గుపడుతూనే ఎలా చిందులేశారో చూడండి..
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:25 PM
పెళ్లి వేడుకకు డ్యాన్స్, సంగీతం మరింత వినోదాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి పెళ్లి వేడుకలో చేసే డ్యాన్స్ ఎన్నో మధురానుభూతులను మిగులుస్తుంది. ఇక, వధూవరులు కూడా చిందులేస్తే ఆ సందడే వేరు. అయితే చాలా మంది అంత మంది ముందు కలిసి డ్యాన్స్ వేయడానికి ఇబ్బంది పడతారు.
పెళ్లి (Wedding) వేడుకకు డ్యాన్స్, సంగీతం మరింత వినోదాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి పెళ్లి వేడుకలో చేసే డ్యాన్స్ ఎన్నో మధురానుభూతులను మిగులుస్తుంది. ఇక, వధూవరులు కూడా చిందులేస్తే ఆ సందడే వేరు. అయితే చాలా మంది అంత మంది ముందు కలిసి డ్యాన్స్ (Dance) వేయడానికి ఇబ్బంది పడతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఎంగేజ్‌మెంట్ వేడుకలో వధువు, వరుడు కలిసి చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. సిగ్గు పడుతూనే వారు వేసిన డ్యాన్స్‌కు చాలా మంది ఫిదా అవుతున్నారు (Viral Video).
తమిళనాడులో జరిగిన ఓ ఎంగేజ్‌మెంట్ వేడుక సందర్భంగా యువ జంట వేదిక మీదకు వచ్చి ఓ సినిమా పాటకు తమదైన శైలిలో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ పెద్దగా రాని వరుడు కూడా వధువుతో పోటీ చక్కగా డ్యాన్స్ చేశాడు. వధువు సిగ్గుపడుతూ, నవ్వుకుంటూనే వరుడితో కలిసి చిందులేసింది. చుట్టూ ఉన్న బంధుమిత్రులు ఈలలు, చప్పట్లో ఆ నవ జంటను ఉత్సాహపరిచారు. వారిద్దరూ చక్కటి సమన్వయంతో అందరినీ ఆకట్టుకునేలా డ్యాన్స్ చేశారు. ritika_viswanath అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 2.1 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వరుడికి డ్యాన్స్ రాదు.. కానీ, పాటను ఆస్వాదిస్తూ చక్కగా చేశాడు``, ``మంచి అండర్‌స్టాండింగ్ ఉన్న జంట``, ``మీ డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను``, ``చాలా అందంగా ఉంది`` అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్లకు, బ్రెయిన్‌కు నిజమైన టెస్ట్.. ఈ ఫొటోలోని FLOW పదం ఎక్కడుందో వెతకండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..