Viral: మేం అంబానీల కంటే తక్కువ కాదు.. మా ఇంట పెళ్లికి రండి.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
ABN , Publish Date - Nov 20 , 2024 | 09:39 AM
అనంత్ అంబానీ వివాహ వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ప్రముఖులు హాజరైన ఈ వివాహం కోసం అంబానీలు ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఆ వివాహం కనీ వినీ ఎరుగని రీతిలో ప్రచారానికి నోచుకుంది. చాలా మందికి వివాహ వేడుక అంటే అంబానీ పెళ్లి మాత్రమే గుర్తుకువస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుక (Anant Ambani Marriage) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ప్రముఖులు హాజరైన ఈ వివాహం కోసం అంబానీలు ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఆ వివాహం కనీ వినీ ఎరుగని రీతిలో ప్రచారానికి నోచుకుంది. చాలా మందికి వివాహ వేడుక అంటే అంబానీ పెళ్లి మాత్రమే గుర్తుకువస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం తమ ఇంట్లో జరిగే పెళ్లికి వినూత్నంగా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేయించింది. అది చూస్తే ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా రావడం సహజం (Viral wedding card).
``ఈ అసాధారణ వెడ్డింగ్ కార్డ్ కోసం ఎంత ఖర్చు పెట్టామో చూడండి. మనం అంబానీ కంటే తక్కువ కాదు`` అంటూ శర్మాజీ అబ్బాయి పెళ్లికి ఆహ్వానించారు. ఆ కార్డు దిగువన.. `` 'బహుమతులు తీసుకురావద్దు. దయచేసి నగదు మాత్రమే ఇవ్వండి. 18 జ్యూసర్ గ్రైండర్లను ఏమి చేసుకుంటాం`` అని రాసి ఉంది. ఆ పక్క పేజీలో.. ``దీపికా- రణవీర్ 6 ఫంక్షన్లు చేయగలిగితే, ప్రియాంక-నిక్ 8 ఫంక్షన్లు చేయగలిగితే.. మేము 2-3 అయినా చేయగలము`` అని తమాషాగా రాశారు. అంతేకాదు ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో కల్యాణ మండపానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇచ్చారు. ఆ శుభలేఖ పైన ``హానెస్ట్ వెడ్డింగ్ కార్డ్`` అని రాశారు.
@AksharPathak అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ శుభలేఖ షేర్ అయింది. ఆ వెడ్డింగ్ కార్డును చాలా మంది వీక్షించి నవ్వుకుంటున్నారు. దాదాపు 10 లక్షల మంది ఈ వెడ్డింగ్ కార్డ్‌ను వీక్షించారు. 16 వేల మంది దీనిని లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``విందు వివరాలు చెప్పలేదేంటి``, ``ఈ కార్డ్‌లో పేర్లు మార్పించుకుని నా పెళ్లికి ఇదే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తాను``, ``మనం ఎవరికీ తక్కువ కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: చిన్న వయసులోనే చాలా విషయాలు తెలుసుకున్నాడు.. ఎగ్జామ్‌లో ఆ కుర్రాడు రాసింది చదివితే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి