Viral Video: పాకిస్తాన్ మోడల్.. ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఒకేసారి ఐదుగురకి ఛాన్స్.. చూస్తే నవ్వాపుకోలేరు..
ABN , Publish Date - Nov 20 , 2024 | 08:40 AM
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల ఏం జరిగినా అది క్షణాల్లో అందరినీ చేరిపోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ (Pakistan) చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ (Petrol) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ (Variety bike) చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ బైక్ మీద ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
zainki_chawlay అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బైక్‌ను చూపించారు. ఆ బైక్ చూడడానికి వెరైటీగా కనిపిస్తోంది. నిజానికి అది పాత మోడల్ సీడీ 70 బైక్. అయితే దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దాని సీటును పొడవుగా మార్చేశారు. రెండు చక్రాల మధ్య దూరాన్ని పెంచారు. ఈ మోడిఫైడ్ బైక్‌పై ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు సులభంగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ఈ మోడిఫైడ్ బైక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బైక్‌ను చూసిన ప్రజలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``నలుగురు భార్యలు కలిగిన వ్యక్తి ఈ బైక్‌ను రూపొందించి ఉంటాడు``, ``పాకిస్తాన్‌కు చెందిన హయబుసా బైక్ మోడల్``, ``పాకిస్తాన్ టెక్నాలజీ అమోఘం``, ``వామ్మో.. ఇది ఒక కిలోమీటర్ అయినా వెళ్తుందా``, ``ఇలాంటివి పాకిస్తాన్‌లో మాత్రమే తయారవుతాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: చిన్న వయసులోనే చాలా విషయాలు తెలుసుకున్నాడు.. ఎగ్జామ్‌లో ఆ కుర్రాడు రాసింది చదివితే..
Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ అడవిలో కప్ప ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి