Share News

Viral News: పులికి ముద్దులు.. తిరిగి పులి ఏం చేసిందంటే

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:50 PM

కృర మృగాలపై ప్రేమ చూపిస్తే అవి కూడా మమకారంగా ఉంటాయి. పులి, సింహం ఇందుకు అతీతం కాదు. ఓ వృద్దురాలు పులితో చక్కగా ఆడుతోంది. పాలు తాగిస్తూ, లాలిస్తూ.. మాట్లాడుతుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

Viral News: పులికి ముద్దులు.. తిరిగి పులి ఏం చేసిందంటే
Woman Kept Feeding Milk To Tiger

కృర మృగాలపై ప్రేమ చూపిస్తే అవి కూడా మమకారంగా ఉంటాయి. పులి (Tiger), సింహం (Lion) ఇందుకు అతీతం కాదు. ఓ వృద్దురాలు పులితో చక్కగా ఆడుతోంది. పాలు తాగిస్తూ, లాలిస్తూ.. మాట్లాడుతుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. పులి పిల్లతో ఆటలా అని ఒకరు.. మీరు గ్రేట్ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.


చిన్న పిల్ల కాదే..

ఆ వీడియోలో పులి చక్కగా కనిపిస్తోంది. అదేం చిన్న పిల్ల కాదు. పెద్ద పులి. బొచ్చు చూస్తేనే కొందరు జడుసుకుంటారు. ఓ వృద్దురాలు దాని పక్కన ఎలాంటి భయం, బెదురు లేకుండా చక్కగా ఉంది. పులి కోసం తీసుకొచ్చిన పాలను పాన్‌లో ఉంచి తాగించింది. పాలు తాగే సమయంలో బామ్మ- పులి ఇద్దరు ఒకరిపై మరొకరు మమకారాన్ని చాటుకున్నారు. పులి నుదుటపై బామ్మ ముద్దు పెట్టింది. పులి కూడా బామ్మ వద్దకు అంతే అప్యాయతతో వచ్చింది. ఆ వీడియో చూస్తే చిన్న పిల్లలు భయపడటం ఖాయం. ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో ఆ సెక్షన్ నిండి పోయింది. ఒక్కొక్కరు ఒకలా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


పులి పిల్ల

పులి అందంగా ఉందే. పులి పిల్లే ఇది అని ఒకరు కామెంట్ చేశారు. ఆ పులిని బామ్మ చాలా చక్కగా చూసుకుంటున్నారని ఇంకొకరు అభిప్రాయ పడ్డారు. అద్భుతం.. బామ్మ- పులి ఇద్దరూ చక్కగా ఉన్నారని మరొకరు కామెంట్ చేశారు. పులిని పిల్లి పిల్లలాగా బామ్మ అనుకుంటుంది, ఆ బామ్మను.. అమ్మ, బామ్మ అని పులి అనుకుంటోందని మరొకరు రాసుకొచ్చారు. ఇలా ఎవరికి నచ్చిన అభిప్రాయాన్ని రాశారు.

ఇది కూడా చదవండి:

Viral News: 14 ఏళ్ల బాలిక.. బాహుబలిలా మారి..

Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి

Viral: నిద్రపోతున్న వ్యక్తి ముక్కులోకి దూరిన బొద్దింక.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Sep 09 , 2024 | 06:00 PM