Share News

Viral: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శృతి హాసన్ ఆగ్రహం!

ABN , Publish Date - Oct 11 , 2024 | 02:49 PM

ఇండిగో తీరుపై మండిపడుతూ నటి శృతి హాసన్ పోస్టు పెట్టింది. ప్రయాణికులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్ నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరడంపై ఆమె గుస్సా అయ్యింది

Viral: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శృతి హాసన్ ఆగ్రహం!

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో సంస్థ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. నిత్యం ప్రయాణికులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నటి వచ్చి చేరింది. ఇండిగో తీరుపై మండిపడుతూ నటి శృతి హాసన్ పోస్టు పెట్టింది. ప్రయాణికులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్ నాలుగు గంటల ఆలస్యం కావడంపై ఆమె గుస్సా అయ్యింది (Viral).

Viral: ఒంటరిగా స్లమ్ ఏరియాకు వెళ్లిన ఫారినర్! అతడిని స్థానికులు చూసి..


‘‘నేను సాధారణంగా ఇలాంటి విషయాల్లో సర్దుబాటు ధోరణితో ఉంటాను కానీ ఈసారి ఇండిగో మాత్రం మరీ ఇబ్బంది పెట్టేసింది. నాలుగు గంటలుగా మేము ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నా ఫ్లైట్ ఇంతవరకూ బయలుదేరలేదు. ఇటువంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి. మరింత మెరుగైన విధానాలు అవలంబించాలి’’ అని ట్వీట్ చేసింది.

ఈ పోస్టుకు వెంటనే స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్.. ప్రయాణికులు ఇబ్బంది పడ్డందుకు విచారం వ్యక్తం చేసింది. ‘‘మిస్ హాసన్ మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ఫ్లైట్ ఆలస్యమైతే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోగలం. ముంబైలో వాతావరణం అనుకూలించక ఫ్లైట్ ఆలస్యం అయ్యింది. ఈ అంశాలు మా చేతుల్లో లేవని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం. కస్టమర్లకు ఇబ్బంది రాకుండా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము’’ అరి రిప్లై ఇచ్చింది.

Viral: విమానం నడుపుతన్న భర్తకు గుండెపోటు! ఒంటరైన భార్య ఊహించని విధంగా..


కాగా, గతంలో సామాన్యులతో పాటు అనేక మంది నటీనటులు కూడా ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పాపెట్టకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేసినందుకు నటి దివ్యా దత్తా ఇటీవల ఇండిగోపై మండిపడ్డారు. ఇది చాలా దారుణ అనుభవమని వ్యాఖ్యానించారు.

Turkish Airlines: మార్గమధ్యంలో పైలట్ మరణం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Read Latest and Viral News

Updated Date - Oct 11 , 2024 | 03:08 PM