Viral: 27 ఏళ్ల కూతురు కొడుకని తెలిసి తల్లిదండ్రులకు షాక్! పెళ్లి కుదిరాక బయటపడ్డ సీక్రెట్!
ABN , Publish Date - May 06 , 2024 | 07:58 PM
ఇరవై ఏడేళ్లుగా అల్లారముద్దుగా పెంచుకున్న కూతురు వాస్తవానికి పురుషుడని తెలిసి తల్లిదండ్రులు షాకైపోయిన వింత ఘటన చైనాలో వెలుగు చూసింది. యువతి కడుపులో వృషణాలను గుర్తించిన వైద్యులు వాటిని శస్త్రచికిత్సతో తొలగించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరవై ఏడేళ్లుగా అల్లారముద్దుగా పెంచుకున్న కూతురు వాస్తవానికి పురుషుడని తెలిసి తల్లిదండ్రులు షాకైపోయిన వింత ఘటన చైనాలో (China) వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతోంది.
చైనాలోని హూబే ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబంలో యువతికి పెళ్లి కుదిరింది. వాస్తవానికి ఆమె చిన్నప్పటి నుంచీ ఇతర ఆడపిల్లల కంటే కాస్త భిన్నంగా ఉండేది. ఇంత వరకూ ఒక్కసారి కూడా ఆమెకు పీరియడ్స్ రాలేదు. చూడటానికి యువతిలాగే ఉన్నా స్త్రీసహజనమైన అనేక లక్షణాలు ఆమెలో కనిపించేవి కావు. ఈ విషయమై 18 ఏళ్ల వయసులోనే బాలికను తల్లిదండ్రులు డాక్టర్‌కు చూపించారు. ఆమెలో అండాశయాలు విఫలమయ్యాయని అప్పట్లో వైద్యులు చెప్పారు. మరిన్ని టెస్టులు జరిపి ఆమె పరిస్థితికి పూర్తి కారణాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వారు ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయారు.
Sweat Rice balls: అందమైన యువతుల చంకలోని చెమటతో ఘుమఘుమలాడే డిష్.. తెగ తింటున్న జనాలు!
ఈ క్రమంలో యువతికి పెళ్లి కుదరడంతో మళ్లీ వైద్యులను సంప్రదించారు. ఈసారి వైద్యులు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువతి ఉదర భాగంలో వృషణాలు ఉన్నాయని, అవి పురుష హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో, యువతితో సహా ఆమె కుటుంబసభ్యులు కూడా షాకైపోయారు (After 27 years Parents discovered that their daughter is a boy adrenal Hyperplasia).
యువతి అడ్రెనల్ హైపర్ ప్లేసియా అనే వ్యాధితో బాధపడుతోందని అమెను పరీక్షించిన గెనెకాలజిస్టు తెలిపింది. ఇది విని యువతి కాళ్లకింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. ఇంతకాలం తాను మహిళలనే భావించానని, ఇప్పుడు తాను స్త్రీ కాదని తెలిశాక ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆమె వాపోయింది.
అయితే, ఈ పరిస్థితితో ఆమెకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో దాగున్న వృషణాలను తొలగించారు. ఆమెలో స్త్రీ సహజ లక్షణాలను పెంచేందుకు హార్మోన్ థెరపీ కూడా ప్రారంభించారు. యువతి ఎముకలు కూడా బలహీనంగా మారడంతో తగు చికిత్స ప్రారంభించారు.